Pawan Kalyan : : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు తన చేతిలో పదవి ఉన్నందువల్ల చాలామంది నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వెనుకబడిన వర్గాల వారిని కూడా ఉద్ధరించే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన చేస్తున్న ప్రతి పనికి జనాలా నుంచి విశేషమైన స్పందన రావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఎన్నికల బరిలో నిలిచాడో అప్పటినుంచి సినిమా షూటింగ్ లకు దూరమవుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పటికే ఆయన సెట్స్ మీద మూడు సినిమాలు ఉంచాడు. ఇక తొందర్లోనే ఆ సినిమాలను కంప్లీట్ చేసే ఆలోచనను పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎట్టకేలకు ఆయన రీసెంట్ గా హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇక దాంతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఎందుకంటే ఈ సినిమాలకు కమిటీ అయి ఆల్రెడీ చాలా రోజులవుతుంది. కాబట్టి వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీదే ఉంది.
మరి మొదట్లో ఎలక్షన్స్ అంటూ బిజీగా తిరిగిన పవన్ కళ్యాణ్ తనకు అనుకూలంగా రిజల్ట్ రావడంతో డిప్యూటీ సీఎం గా ఎదిగాడు. ఇక అప్పటినుంచి ప్రజాసేవలోనే నిమగ్నమైపోయాడు కాబట్టి ఇప్పటివరకు తన సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు.
కానీ ఎట్టకేలకు ఇప్పుడు సినిమాలను చేయాల్సిన అవసరమైతే వచ్చింది.
కాబట్టి ఈ సినిమాలను ఫినిష్ చేసి తదుపరి సినిమాలను అనౌన్స్ చేస్తాడా లేదంటే సినిమాల నుంచి పూర్తిగా రిటైర్ మెంట్ తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది… ఇది ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకోగలిగే కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఇకమీదట సినిమాలు చేస్తే చూడడానికి చాలా మంది జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఆయన నుంచి సినిమాలు రాకపోయినా కూడా ఆయన ఇంతకు ముందు చేసిన పాత సినిమాలను రీ రిలీజ్ చేసుకొని మరి చూస్తూ తన అభిమానులు ఆనందపడుతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన నటుడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ప్రస్తుతం ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి అయితే ఉంది. మరి తను అనుకున్నట్టుగానే రాబోయే రోజుల్లో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…