Rithu Chowdary : జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో రీతూ చౌదరి ఒకరు. ఈమె ఏళ్ల తరబడి ఈ లెజెండరీ కామెడీ షోలో చేశారు. గ్లామర్ తో పాటు చక్కని కామెడీ టైమింగ్ రీతూ చౌదరి సొంతం. ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. తరచుగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తారు. తాజాగా నీలి రంగు పూల చీరలో పరువాలు పరిచింది. అందాల విందు చేసింది. ఫైట పక్కకు జరిపి నాభి చూపిస్తూ గుండెలు కొల్లగొట్టింది. రీతూ గ్లామర్ మెంటల్ తెప్పిస్తుండగా కుర్రాళ్ళ మతులు పోతున్నాయి. క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల రీతూ జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి కన్నుమూశారు. తండ్రి మరణాన్ని రీతూ చౌదరి తట్టుకోలేకపోయింది. బాగా ఎమోషనల్ అయ్యింది. ఓ షోలో తండ్రిని తలచుకుని రీతూ చౌదరి కన్నీటి పర్యంతం అయ్యారు. రీతూ ఏడవడం అందరినీ కలచివేసింది.
రీతూ చౌదరి పెళ్లి అంటూ ప్రచారం జరిగింది. ఓ వ్యక్తితో ఆమె సన్నిహితంగా కనిపించారు. ఆయన్నే ఆమె వివాహం చేసుకుంటున్నారనే కథనాలు వెలువడ్డాయి. ఏపీకి చెందిన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అంటూ ఊహాగానాలు వినిపించాయి. రీతూ చౌదరి పెళ్లి వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. అయితే తర్వాత మెల్లగా ఆ పుకార్లు సద్దుమణిగాయి. దీంతో రీతూ చౌదరి పెళ్లి వార్తలకు బ్రేక్ పడింది.
ఇక యాంకర్ విష్ణుప్రియ భీమినేనితో రీతూ చౌదరి అత్యంత సన్నిహితంగా ఉంటారు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. జంటగా విదేశాలకు టూర్స్ కి వెళుతుంటారు. ఆ మధ్య ఇద్దరూ థాయిలాండ్ టూర్ కి వెళ్లారు. కొద్ది రోజుల పాటు హ్యాపీ గడిపారు. రీతూ చౌదరి, విష్ణుప్రియ వెకేషన్ ఫోటోలు వైరల్ అయ్యాయి. కాగా రీతూ చౌదరి కూడా జబర్దస్త్ కి దూరమైంది. బుల్లితెరపై ఆమె సందడి తగ్గింది.