https://oktelugu.com/

Jabardast Punch Prasad : చేతులెత్తిసిన డాక్టర్స్.. జబర్దస్త్ పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం!

కనీసం సోషల్ మీడియా లో వచ్చే నెగటివిటీ ని గమనించి అయినా పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సహాయం చేస్తుందో లేదో చూడాలి.

Written By:
  • Vicky
  • , Updated On : June 4, 2023 / 08:33 AM IST
    Follow us on

    Jabardast Punch Prasad : జబర్దస్త్ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రజలకు దగ్గరైన పంచ్ ప్రసాద్ ఆరోగ్యం గత కొంత కాలం నుండి క్షీణించిన సంగతి తెలిసిందే. రెండు మూత్ర పిండాలు చేరిపోవడం తో ప్రతీ రోజు డయాలిసిస్ చేస్తే కానీ  మనుగడ సాగడం కష్టం. అభిమానుల సహాయం తో ఇన్ని రోజులు ఆయనకీ డయాలిసిస్ జరిగింది. కానీ ఆయన ఆరోగ్యం లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు పంచ్ ప్రసాద్ కి అర్జెంటు గా ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు.

    వెంటనే ఆపరేషన్ చేసి మూత్ర పిండాల మార్పిడి చెయ్యకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని, ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అని ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తెలిపాడు. ఆపరేషన్ అర్జెంటు గా చెయ్యాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని, అంత డబ్బులు ఇప్పుడు లేవని, దయచేసి ఎవరైనా సహాయం చెయ్యాలనుకుంటే చెయ్యండి అంటూ పంచ్ ప్రసాద్ ఫోన్ పే కోడ్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాడు నూకరాజు.

    పంచ్ ప్రసాద్ డయాలిసిస్ చేసుకుంటూ కూడా ఈటీవీ లో జరిగే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవాడు. అయితే ఆయనకీ ఇంత సమస్య ఉందని తెలిసి కూడా ఎందుకు ఈటీవీ యాజమాన్యం ఆయనకి కావాల్సినంత డబ్బుని ఏర్పాటు చేసి ఆపరేషన్ చేయించడం లేదు..?, తన ఛానల్ లో పని చేస్తున్నప్పుడు పక్క ఛానల్ లో పని చెయ్యకూడదు అని, మీరు మాకు ఎక్సక్లూసివ్ అని లాక్ చేసి, అదనపు సంపాదన లేకుండా చేసిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్, తమతో ఇనాళ్ళు కలిసి పనిచేసిన వారి కోసం ఆమాత్రం సహాయం చేయలేరా?.

    గతం లో కూడా ఇంతే ఢీ కొరియోగ్రాఫర్  చైతన్య మాస్టర్ కి చాలీ చాలని డబ్బులు ఇచ్చి, తన గ్రూప్ లో డ్యాన్స్ వేసే వాళ్లందరికీ డబ్బులు ఇవ్వడం కోసం అప్పులు చేసి, వాటిని తిరిగి కట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రాణాపాయ స్థితి లో ఉన్న పంచ్ ప్రసాద్ విషయం లో కూడా అలాగే ప్రవర్తిస్తుంది టీం. కనీసం సోషల్ మీడియా లో వచ్చే నెగటివిటీ ని గమనించి అయినా పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సహాయం చేస్తుందో లేదో చూడాలి.