Aadipurush : ‘ఆదిపురుష్’ 3D అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. కానీ 2D టికెట్స్ కదలడం లేదు!

ఆదిపురుష్ విడుదల రోజే హాలీవుడ్ క్రేజీ మూవీ ఫ్లాష్ కూడా విడుదల అవ్వబోతుండడం తో 3D షోస్ ఎక్కువ దొరకడం లేదట. ఇదే ట్రెండ్ తో ముందుకు పోతే ప్రీమియర్స్ నుండి 1 మిలియన్ డాలర్స్ కంటే తక్కువ వసూళ్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు

Written By: Vicky, Updated On : June 4, 2023 8:42 am
Follow us on

Aadipurush : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్ మరియు పాటలతో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 6 వ తారీఖున తిరుపతి లో ఘనంగా జరగబోతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిపించడానికి సిద్ధం అవుతుంది మూవీ టీం.

ఇప్పటికే అందుకోసం 200 సింగర్స్ మరియు డ్యాన్సర్లని స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేసినట్టు సమాచారం. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్పెషల్ సెట్  వేసారట. తిరుపతి మొత్తం శ్రీ రామ నామం ప్రతిధ్వనించేలా ఏర్పాట్లు చేశారట. అందుకోసం సుమారుగా రెండు నుండి మూడు కోట్ల రూపాయిల ఖర్చు కూడా చేసినట్టు సమాచారం.

ఇక ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికా లో ప్రారంభం అయ్యి చాలా రోజులు అయ్యింది. 280 కి పైగా షోస్ కి సంబంధించి 2D మరియు 3D వెర్షన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఈ 280 షోస్ కి గాను రెండు ఫార్మట్స్ కి కలిపి ఇప్పటి వరకు 63 వేల డాలర్లు వచ్చాయి. వీటిలో 2D ఫార్మటు లో ప్రదర్శింపబోతున్న 233 షోస్ కి గాను 31.4 వేల డాలర్లు వస్తే, 3D ఫార్మటు లో ప్రదర్శింపబోతున్న 47 షోస్ కి గాను 31.8 వేల డాలర్లు వచ్చాయి. 3D షోస్ తక్కువ ఉన్నప్పటికీ , 2D షోస్ మీద అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకున్నాయి. ఫ్యాన్స్ 3D షోస్ పెంచమని ట్విట్టర్ లో టీ సిరీస్ సంస్థని ట్యాగ్ చేసి డిమాండ్ చేస్తున్నారు.

కానీ ఆదిపురుష్ విడుదల రోజే హాలీవుడ్ క్రేజీ మూవీ ఫ్లాష్ కూడా విడుదల అవ్వబోతుండడం తో 3D షోస్ ఎక్కువ దొరకడం లేదట. ఇదే ట్రెండ్ తో ముందుకు పోతే ప్రీమియర్స్ నుండి 1 మిలియన్ డాలర్స్ కంటే తక్కువ వసూళ్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు, ఎందుకంటే 2D షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి.