Jabardast Lady In Bigg Boss 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఘనంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ఈసారి మరింత జోష్ తో మొదలుపెట్టారు. ఏకంగా 21 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించి ఔరా అనిపించారు. ఇంత మందిని ఒకేసారి లోపలికి పంపడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటే ఈ సంఖ్య మరింత దాటిపోతుంది.

బిగ్ బాస్ లో ఈసారి ఎవరెవరు ఉంటారన్న ఆసక్తితో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఆసక్తిగా చూశారు. గత సారి జబర్ధస్త్ నుంచి కమెడియన్ ముక్కు అవినాష్ ఎంట్రీ ఇవ్వగా.. ఈసారి చలాకీ చంటిని బిగ్ బాస్ టీం లాగేసింది. జబర్ధస్త్ లో ప్రస్తుతం యాక్టివ్ కమెడియన్ గా చంటీ ఉన్నారు. అతడు జబర్ధస్త్ నుంచి వచ్చాడంటే అందరూ షాక్ అవుతున్నారు.

ఇక జబర్ధస్త్ నుంచి మరో లేడీ కంటెస్టెంట్ ను కూడా బిగ్ బాస్ లోకి తీసుకున్నారు. ఆమె ఎవరో కాదు ‘ఫైమా’. బుల్లెట్ భాస్కర్ టీంలో కీలక పాత్ర పోషించే ఫైమా కామెడీ చేయడంలో కింగ్. తన రూపం, ఆకారం నుంచే నవ్వులు పూయించే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

ఇక తనను జబర్ధస్త్ లో ఎంకరేజ్ చేసిన తోటి కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్టు స్టేజీపైనే ఒప్పుకుంది. అతడు పంపిన కామెడీ లెటర్ ను చదివి నవ్వులు పూయించింది. లేఖ చివర్లో తాను ఫైమాను ప్రేమిస్తున్నట్టు ప్రవీణ్ తెలిపి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. దానికి ఫైమా కన్నీటి పర్యంతం అయ్యింది.
-ఫైమా ఎవరు?
తెలంగాణలోని దూమకొండ అనే చిన్న పల్లెలో ఫైమా జన్మించింది. పెద్దగా చదువుకోలేదు. నలుగురు ఆడపిల్లల్లో ఫైమా ఒకరు. అమ్మ కష్టపడుతూ నలుగురు ఆడపిల్లలను పెంచి పెద్ద చేసింది. తండ్రి ఒక వాచ్ మెన్. సొంత ఇల్లు లేక 35 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ లెక్కలేనన్ని కష్టాలు అనుభవించింది. కనీసం ఆడపిల్లలకు బాత్రూం కూడా లేకుండా చంబు పట్టుకొని వెళ్లామని వాపోయింది. ఆమె నవ్వుల్లో ఎన్నో కష్టాలున్నాయని బిగ్ బాస్ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. తన తల్లికి ఇల్లు కట్టించడమే ధ్యేయమని ఫైమా బిగ్ బాస్ వేదికపై తన కోరికను బయటపెట్టింది.
ఈటీవీలో ‘పటాస్’ షో ద్వారా స్టాండప్ కమెడియన్ గా ఫైమా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కామెడీతో తక్కువ సమయంలోనే స్టార్గా ఎదిగింది. తను నల్లగా ఉన్నానని.. పర్సనాలిటీల లేదని.. నిన్ను బిగ్ బాస్ లోకి ఎవరు పిలుస్తారని అవమానించిన వారికి బిగ్ బాస్ స్టేజీపైకి వచ్చి సమాధానమిచ్చానని చెప్పుకొచ్చింది.
జబర్ధస్త్ కమెడియన్ ప్రవీణ్ తో తాను ప్రేమలో ఉన్నట్టు ఫైమా ఒప్పుకుంది. తనకోసం ఎంతో చేసిన ప్రవీణ్.. తన తండ్రి చనిపోయినా కూడా తనను బిగ్ బాస్ కు పంపించాడని.. అతడి లక్ష్యం నెరవేరుస్తానంటూ చెప్పుకొచ్చింది.
ఫైమా జబర్ధస్త్ వదిలి వచ్చినందుకు ఆమెకు బిగ్ బాస్ టీం భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలిసింది. వారానికి రూ.3 లక్షల వరకూ ఇవ్వడానికి ఓకే చెప్పిందని.. క్లిక్ అయితే జబర్ధస్త్ లో ఆమె రెమ్యూరేషన్ కు డబుల్ డబ్బులు కూడా ముట్టచెబుతామని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చి పిలిచినట్టు తెలిసింది. అటు రెమ్యూనరేషన్ తోపాటు.. ఎక్స్ ట్రా కూడా వస్తుండడంతోనే ఫైమా బిగ్ బాస్ లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది.