Actress Madhavilatha: టాలీవుడ్ ఫైర్ బ్రాండ్స్ లో మాధవీలత ఒకరు. ఈమె తరచుగా సోషల్, పొలిటికల్ కామెంట్స్ చేస్తుంటారు. బిగ్ బాస్ షోని వ్యతిరేకించే వాళ్లలో మాధవీలత కూడా ఒకరు. గతంలో పలుమార్లు ఆమె ఈ షోకి వ్యతిరేకంగా మాట్లాడారు. తాజాగా బిగ్ బాస్ షో టార్గెట్ గా ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. మాధవీలత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్లోకి సామాన్యులను పంపితే ఎవరూ దేకరు. ఎవరిని షోలోకి తీసుకుంటే జనాలు చూస్తారో వాళ్లకు తెలుసు. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ అనే కాన్సెప్ట్ వదిలేయండి. బిగ్ బాస్ 100 శాతం కమర్షియల్ షో. వాళ్లకు టీఆర్పీ కావాలి. చాలా మందిని హౌస్లోకి పంపేందుకు ట్రై చేశారు. మాకు డబ్బులు, ఫేమ్ కంటే ఇజ్జత్ ముఖ్యమని బై బై చెప్పేశారు. బిగ్ బాస్ చూసేవాళ్ళు చూడండి. ఉన్నవాళ్ళతో సరిపెట్టుకోండి. షో చూడమని నన్ను మాత్రం అడగొద్దు.. అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేసింది.
బిగ్ బాస్ షోపై చాలా కాలంగా వ్యతిరేకత ఉంది. ప్రతి సీజన్ మొదలయ్యే ముందు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇటీవల బిగ్ బాస్ షోకి సెన్సార్ ఉండాలని ఏపీ హైకోర్ట్ ఆదేశించింది. ఈ మేరకు నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. సాంప్రదాయవాదులు బిగ్ బాస్ షో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ నారాయణ హోస్ట్ నాగార్జునను, షోని ఉద్దేశించి దారుణ ఆరోపణలు చేశారు.
బిగ్ బాస్ షోని వ్యతిరేకించే వాళ్లలో మాధవీలత కూడా ఉన్నారు. 2008లో నచ్చావులే చిత్రంతో మాధవీలత సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అనంతరం నానికి జంటగా స్నేహితుడా చిత్రం చేసింది. ఇది కూడా మంచి విజయం సాధించింది. అయితే ఆమె స్టార్ కాలేకపోయారు. కెరీర్ కూడా ఏమంత ఆశాజనకంగా సాగలేదు. చివరిగా 2021లో వెండితెర మీద కనిపించింది. ఆమె బీజేపీలో చేరారు.