Allu Aravind : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుకోకుండా సమస్యల్లో చిక్కుకున్నారు. అభిమానులను మరింత ఉత్సాహపరచాలని డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఆయన సంధ్య థియేటర్ కి వెళ్లారు. అభిమానులతో సినిమా చూశారు. పరిమితికి మించి ఫ్యాన్స్ అక్కడకు చేరుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబంతో పాటు పుష్ప 2 మూవీ చూసేందుకు వెళ్లిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు సైతం గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది.
మహిళ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్య థియేటర్ మేనేజర్, యాజమాన్యంతో పాటు బాధ్యులైన వారిని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ని ఛార్జ్ షీట్ లో ఏ 11గా చేర్చారు. అనుమతులు లేకుండా రోడ్ షో చేశాడు, థియేటర్ కి వచ్చాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు . ఆయనకు కోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ పై నిరసనలు వ్యక్తమయ్యాయి. కక్షపూరితంగా అల్లు అర్జున్ ని వేదిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉంటే.. అల్లు అరవింద్ కూడా ఒక కేసులో అరెస్ట్ అయ్యాడట. జైలుకి వెళ్ళాడట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ తండ్రి స్వయంగా తెలియజేశాడు. అల్లు అరవింద్ బాల్యం చెన్నైలోనే గడిచింది. ఆయన తండ్రి అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ కావడంతో అక్కడ స్థిరపడ్డారు. అల్లు అరవింద్ చదువుకునే రోజుల్లో ఒక పెద్ద గొడవ జరిగిందట. కాలేజ్ స్టూడెంట్స్ కోసం పొద్దున్నే ఒక సిటీ బస్ వచ్చేదట. ఒకరోజు ఆ బస్ డ్రైవర్, కండక్టర్ లతో అల్లు అరవింద్ ఫ్రెండ్ కి గొడవైందట.
బస్ ఆపి, డ్రైవర్, కండక్టర్ ని కొట్టిన అల్లు అరవింద్, ఆయన ఫ్రెండ్స్… వారిని వదిలేసి బస్ స్వయంగా నడుపుకుంటూ వెళ్లిపోయారట. స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ ప్రదేశాల్లో దించేశారట. కేసు పెట్టడంతో పోలీసులు వచ్చి అల్లు అరవింద్ ని అరెస్ట్ చేశారట. అప్పుడు సీఎంగా ఉన్న ఎంజీఆర్ తో అల్లు రామలింగయ్య మాట్లాడటంతో కేసు పెద్దది కాలేదట. పోలీసులకు ఎంజీఆర్ చెప్పడంతో అల్లు అరవింద్ ని వదిలేశారట. అదన్నమాట మేటర్..