https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ తో మాస్ సినిమాలు చేయడమే బెస్ట్…ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళకంతు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం కోసం చాలావరకు ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది...వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా తమకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : December 8, 2024 / 02:41 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas : ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడనే విషయాల మీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ప్రభాస్ నుంచి ఒక సినిమా వచ్చింది అంటే ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా 500 నుంచి 600 కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ క్రమంలోనే చాలామంది దర్శకులు ప్రభాస్ తో సినిమాలు చేయాలని ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ప్రభాస్ తో సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం ఇండస్ట్రీ హిట్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా ప్రభాస్ లాంటి ఒక మాస్ హీరోతో ఎలాంటి సినిమా చేయాలి అనే దానిమీద కూడా సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.

    ఇక కొంతమంది దర్శకులు ప్రభాస్ తో చేయబోయే సినిమా అవుట్ అఫ్ ది బాక్స్ ఉండాలని అనుకుంటుంటే మరి కొంతమంది మాత్రం మాస్ సినిమాలు చేస్తేనే ప్రభాస్ తో ఎక్కువగా వర్కౌట్ అవుతాయనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక తను అనుకున్నట్టుగానే ప్రభాస్ ఇక మీదట ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.

    ఇక ఇంతకు ముందు లాగే మాస్ సినిమాలనే నమ్ముకొని ముందుకు అడుగులు వేస్తాడా? లేదంటే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాడా అనే విషయాల పట్ల క్లారిటీ కావాలంటే తర్వాత ఆయన సెలెక్ట్ చేసుకోబోయే సినిమాలను చూస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన కమిటైన సినిమాలు కూడా కొత్త జానర్ లోనే ఉండటం విశేషం…

    ఇక ఇప్పటివరకు ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్ ఒక్కసారి కూడా నటించలేదు. కాబట్టి ఫౌజి సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక స్పిరిట్ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే తనకంటూ ఒక పెను సంచలనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ప్రభాస్ ఆ తర్వాత ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది…