Bigg Boss Telugu 8 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఎంత రసవత్తరంగా సాగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ కంటెస్టెంట్స్ అందరూ హద్దులు దాటేసారు, ఒకరిని ఒకరు తిట్టుకోవడం, కొన్ని సందర్భాలలో కొట్టుకోవడం వంటివి కూడా జరిగింది. ముఖ్యంగా ఈ వారం ప్రారంభం లో విష్ణు ప్రియా, ప్రేరణ మధ్య ‘దోశ’ విషయం లో వాళ్ళ మధ్య జరిగిన గొడవ పెద్దది అయ్యింది. ప్రేరణ ఈ విషయాన్ని మర్చిపోయినప్పటికీ, విష్ణు ప్రియ మర్చిపోలేదు. టాస్కులలో సందర్భం దొరికినప్పుడల్లా విష్ణు ప్రియ ప్రేరణ పై తనకు ఉన్న కోపాన్ని చూపించుకుంటూనే ఉంది. విష్ణు ప్రియ ప్రవర్తన చూసి ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. చాలా అమాయకురాలు అని అనుకున్నాము, ఈమెలో కూడా మహానటి దాగుంది కదా అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే విష్ణు ప్రియ, ప్రేరణ మధ్య ఆ చిన్నగా మొదలైన గొడవ పెద్దది అవ్వడానికి కారణం నాగ మణికంఠ.
అతను లేనిపోనివి చెప్పడం వల్లనే వీళ్లిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ కి గొడవలు చేరాయి. అయితే దీనిపై నాగార్జున నేడు నిజానిజాలు బయటపెట్టాడు. ఆ సందర్భానికి సంబంధించిన వీడియో ని చూపించి ‘ప్రేరణ దోశ నువ్వు చెప్పినట్టుగా వేసిందా?’ అని అడుగుతాడు. దానికి మణికంఠ తప్పు ఒప్పుకోకపోగా, తనని తానూ సమర్దిమ్చుకునే ప్రయత్నం చేసాడు. దీనికి నాగార్జున రెస్పాన్స్ ఇస్తూ ‘తప్పు చేస్తున్నావు..ఆ తప్పుకి నువ్వు పశ్చాత్తాపం కూడా పడడం లేదు’ అని అంటాడు నాగార్జున. ఆ తర్వాత మణికంఠ ని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు నాగార్జున. ఆ తర్వాత అతనికి ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియో ని చూసిన తర్వాత నాగ మణికంఠ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతకు నాగార్జున చూపించిన ఆ వీడియో ఏమిటి?, హౌస్ లో లేడీ కంటెస్టెంట్స్ తో అతను ప్రవర్తిస్తున్న తీరుని చూపించి వార్నింగ్ ఇవ్వబోతున్నాడా?, లేదా అతని కుటుంబానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన వీడియోని చూపించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా నాగ మణికంఠ అమ్మాయిల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై నాగార్జున కచ్చితంగా కోటింగ్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే అతని ప్రవర్తన పట్ల యష్మీ ఇబ్బంది పడింది, విష్ణు ప్రియ ఇబ్బంది పడింది, చివరికి నైనికా కూడా ఇబ్బంది పడింది.
పెళ్ళైన ఒక అబ్బాయి అమ్మాయిలతో ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదంటూ నవ్వుతూనే మణి కంటికి గడ్డి పెట్టారు. ఇంతమంది చెప్తున్నారు కదా, హౌస్ లోనే కంటెస్టెంట్స్ కి ఇలా అనిపిస్తుందంటే, ఇక బయట ఎలా ఉంటుందో అనే స్పృహ కూడా నాగ మణికంఠ కి లేదు. దీనిని బట్టి ఇతనికి అమ్మాయిల పిచ్చి ఉంది అనుకోవాలా అని ప్రేక్షకులు సైతం సందేహిస్తున్నారు. అమ్మాయిలతో ఈ స్థాయిలో పులిహోర కలిపే ఈయన, మద్యమద్యలో నాకు నా పెళ్ళాం కావాలి అంటూ చేసే కామెంట్స్ చాలా ఫన్నీ గా అనిపిస్తాయని నాగ మణికంఠ ని ఏకిపారేస్తున్నారు నెటిజెన్స్.