https://oktelugu.com/

Sandeep Reddy Vanga : రన్ బీర్ కపూర్, విజయ్ దేవరకొండ.. అబ్బో ప్రభాస్ ‘‘స్పిరిట్’’ పై పెద్దే ప్లాన్లే వేస్తున్న సందీప్ రెడ్డి వంగ

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే చాలామందికి మన స్టార్ డైరెక్టర్ల పేర్లు గుర్తుకొస్తూ ఉంటాయి. అందులో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ గా నిలుస్తూ ఉండడం విశేషం... అందుకే ఆయనకు ఇండస్ట్రీలో భారీ డిమాండ్ అయితే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 16, 2024 / 09:29 PM IST

    Spirit Movie

    Follow us on

    Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఇప్పుడు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఆయన చేసిన సినిమాలన్నీ భారీ సక్సెస్ ని సాధించాయి. ఇక అర్జున్ రెడ్డి సినిమాను హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నారు. ఇక దాంతో వెంటనే రన్బీర్ కపూర్ హీరోగా ‘అనిమల్ ‘ అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే భారీ రికార్డ్ లను క్రియేట్ చేసింది. ఇక ఇది ఏమైనా కూడా ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో సందీప్ వంగ తన తదుపరి సినిమాను ప్రభాస్ తో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు… ఇంకెప్పుడు ఆయన ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక వాటికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాను కూడా చాలా వైల్డ్ గా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ చాలా రకాల వార్తలు కూడా వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లో భారీ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దుసుకెళ్తున్నాడు. ఇక ఇది ఏమైనా కూడా ప్రభాస్ చేస్తున్న చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లుగా నిలుస్తున్నాయి.కాబట్టి ఇక మీదట చేయబోయే సినిమాలా విషయం లో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గా కూడా తెలుస్తుంది…

    ఇక ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమా కోసం ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు రంగం లోకి దూకుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదిలా ఉంటే వాళ్ళు ఎవరనే దాని మీదనే ఇప్పుడు చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమాలో విజయ్ దేవరకొండ, రన్బీర్ కపూర్ ఇద్దరు గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.

    నిజానికి వాళ్ళు సినిమా కథ ప్రకారం గెస్ట్ పాత్ర చేస్తున్నారా లేదంటే జస్ట్ సినిమా మీద హైప్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? అనే దాని మీదనే చర్చలు నడుస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో ఏదైనా మ్యాటర్ ఉంటేనే అలాంటి గెస్ట్ రోల్స్ ను పెట్టుకుంటాడు.

    లేకపోతే వాళ్ళను పెట్టుకోడు అంటూ చాలా మంది సందీప్ గురించి గొప్ప గా చెప్పుకుంటున్నారు… ఇక నిజానికైతే విజయ్ దేవరకొండ, రణ్బీర్ కపూర్ చేసే క్యారెక్టర్లు సినిమా మొత్తానికి చాలా హైప్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది…