Ravi Teja : ఆ సూపర్ హిట్ చిత్రం రవితేజ కెరీర్ ని సర్వనాశనం చేసిందా..? ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!

రాజా ది గ్రేట్' చిత్రం తర్వాత రవితేజ 10 కి పైగా సినిమాలు చేసాడు. వాటిల్లో కేవలం 'క్రాక్', 'ధమాకా' చిత్రాలు మాత్రమే సూపర్ హిట్స్ గా నిలిచాయి. 'ఈగల్', 'ఖిలాడీ' చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి.

Written By: Vicky, Updated On : October 16, 2024 9:13 pm

Ravi Teja

Follow us on

Ravi Teja : సాధారణంగా ఒక సూపర్ హిట్ సినిమా సదరు స్టార్ హీరో కి కానీ , డైరెక్టర్ కి కానీ మంచి మైలేజ్ ని ఇస్తుంది. స్టార్ స్టేటస్ పరంగా మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. కానీ కొన్ని సూపర్ హిట్ సినిమాలు మాత్రం ఆయా స్టార్ హీరోలకు శాపం లాగా మారుతున్నాయి. ముఖ్యంగా రవితేజ విషయంలో ఇది చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత రవితేజ ఒక రెండేళ్ల పాటు విరామం ఇచ్చి, అనిల్ రావిపూడితో ‘రాజా ది గ్రేట్’ అనే చిత్రం ద్వారా మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముందుగా ఈ సినిమాని ఎనెర్జిటిక్ స్టార్ రామ్ తో చేయాలనీ అనుకున్నాడు అనిల్. రామ్ కి కూడా కథ నచ్చింది కానీ, ఎందుకో చివరి నిమిషం లో తప్పుకున్నాడు. ఆ సమయం లో రొటీన్ కథలు కాకుండా,కొత్త తరహా కథలు చేసేందుకు ఎదురు చూస్తున్న రవితేజ కి అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ కథని వినిపించాడు. రవితేజ కి ఆ కథ తెగ నచ్చేసింది.

వెంటనే ఓకే చెప్పి సినిమా చేసాడు. ఫలితం కూడా అదిరిపోయింది. ముఖ్యంగా గుడ్డివాడిలాగా ఆయన నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి. అంత సహజం గా ఈ జనరేషన్ లో ఏ హీరో కూడా నటించలేదు. అలా అంత అద్భుతంగా నటించడమే రవితేజ కి ఇప్పుడు మైనస్ అయ్యింది. ఆ సినిమా ఇచ్చిన ఇమేజ్ నుండి రవితేజ బయట పడలేకపోతున్నాడు. ప్రతీ సినిమాలోనూ ఆయనని చూసినప్పుడల్లా రాజా ది గ్రేట్ రవితేజ నే గుర్తుకు వస్తున్నాడు. లుక్స్ కూడా ఏ మాత్రం మార్చకపోవడంతో జనాలకు అలాంటి అనుభూతి కలుగుతుంది అని చెప్పొచ్చు. ఆ కారణం చేతనే రీసెంట్ గా రవితేజ చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అనేది విశ్లేషకుల అభిప్రాయం.

‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత రవితేజ 10 కి పైగా సినిమాలు చేసాడు. వాటిల్లో కేవలం ‘క్రాక్’, ‘ధమాకా’ చిత్రాలు మాత్రమే సూపర్ హిట్స్ గా నిలిచాయి. ‘ఈగల్’, ‘ఖిలాడీ’ చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అభిమానులు కూడా రవితేజ కి వరుస ఫ్లాప్స్ వస్తుండడం వల్ల తీవ్రమైన నిరాశకు గురయ్యారు. మరి రవితేజ ని ఈ ఈ ఇమేజి నుండి బయటకి తీసుకొచ్చి మళ్ళీ ఆయనకు భారీ హిట్ ఇచ్చేది ఎవరు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన 75 వ చిత్రం పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.