Pallavi Prashanth: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కాగా ఈ సీజన్ లో ఒక కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. ఆటల్లో సత్తా చూపిస్తూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. అయితే ఈ సీజన్ టైటిల్ రేసులో ఉన్నాడు. ప్రశాంత్ మొదట్లో రతిక తో పులిహోర కలిపి రైతు బిడ్డ కాస్త పులిహోర బిడ్డగా మారాడు. తర్వాత తప్పు తెలుసుకుని ట్రాక్ మార్చి .. గేమ్ పై దృష్టి పెట్టాడు. ఒక కామనర్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని నిరూపించాడు ప్రశాంత్.
అయితే ప్రశాంత్ కి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఏకంగా పవర్ స్టార్ మూవీ లో నటించే అవకాశం కొట్టేసాడు. కాగా టైటిల్ రేస్ లో ఉన్న ప్రశాంత్ .. ఇంకా టైటిల్ కొట్టక ముందే లక్కీ ఛాన్స్ వచ్చింది. పల్లవి ప్రశాంత్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. బిగ్ బాస్ ను డైలీ ఫాలో అయ్యే వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరు అని తెలుస్తుంది.
ఆయనకు ప్రశాంత్ గేమ్ బాగా నచ్చేసిందట .. అందుకే హరీష్ శంకర్ ప్రస్తుతం తాను చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో ప్రశాంత్ కి ఒక పాత్ర ఇవ్వాలని అనుకుంటున్నారని ఫిలిం వర్గాల సమాచారం. ఫినాలే ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చి హరీష్ ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తాడని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఇది పక్కన పెడితే .. ఇప్పటికే సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.
ఫినాలే కి ఏర్పాట్లు చేస్తున్నారు బిగ్ బాస్ టీం. గత కొన్ని రోజుల నుంచి ఫినాలే అస్త్ర రేస్ నిర్వహించగా అర్జున్ సాధించాడు. ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో టాప్ 5 లో అర్జున్ బెర్త్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. దీని ప్రకారం అర్జున్, శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక టాప్ 5 లో ఉంటారని సమాచారం. యావర్ కి కూడా ఛాన్స్ ఉంది.