Sukumar : నిన్నటి నుండి హైదరాబాద్ లో నివసించే సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ అధికారులు రైడింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నుండి ఈ సోదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పుష్ప 2 నిర్మాతలు, దేవర నిర్మాతలు, అభిషేక్ అగర్వాల్ ఇలా ఎంతో మంది సినీ ప్రముఖులపై ఇక కాలం లో సోదాలు నిర్వహించిన ఘటన సంచలనంగా మారింది. దిల్ రాజు ఇంట్లో అయితే నిన్న 18 గంటలు ఐటీ సోదాలు నిర్వహించారు. దిల్ రాజు సతీమణి ని కూడా బ్యాంక్ కి తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించి సోదాలు నిర్వహించారు. రెండవ రోజు కూడా దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే నేడు పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ఇంటి పై కూడా ఐటీ సోదాలు నిర్వహించిన ఘటన ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమని షాక్ కి గురి చేసింది.
నిన్న పుష్ప 2 నిర్మాతలపై సోదాలు నిర్వహించగా, నేడు సుకుమార్ ఇంటికి సోదాలు షిఫ్ట్ చేయడం చూస్తుంటే, నిర్మాతలు మరియు సుకుమార్ మధ్య పెద్ద స్థాయిలో డబ్బుల ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా భావించవచ్చు. అంటే లాభాల్లో షేర్ వంటివి అన్నమాట. సుకుమార్ దాకా సోదాలు నిర్వహించారంటే, అల్లు అర్జున్ వైపు పోకుండా ఉంటారని మాత్రం ఊహించకండి. కచ్చితంగా అల్లు అర్జున్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు రేపు లేదా ఎల్లుండి జరపొచ్చు. ఇలా ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ లోని ప్రముఖులపై ఐటీ సోదాలు నిర్వహించడం ఏమిటి అని ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున్న సాగుతున్న చర్చ. ప్రభుత్వమే టార్గెట్ చేసి ఇలా చేయిస్తుందా?, లేదా సినీ నిర్మాతలు అత్యుత్సాహాన్ని పోయి పోస్టర్ల మీద వేస్తున్న కలెక్షన్స్ ని చూసి , వాళ్ళని పరిశీలించడానికి వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.
అయితే నిర్మాతలందరూ టాక్సులు సరైన సమయంలో కడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి చేదు వార్త ఇప్పటి వరకు ఈ సోదాల ద్వారా వెలువడలేదు. క్లీన్ చిట్ గా ఉండే సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు చేసి సమయం ఎందుకు వృధా చేస్తారు, రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ సోదాలు నిర్వహిస్తే వంద కోట్ల రూపాయిలు ప్రభుత్వానికి చేరుతుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా ఇందులో దొరికిపోతారు. కానీ రాజకీయ నాయకుల మీద ఇలాంటి సోదాలు నిర్వహించరు. ప్రతీ చిన్న దానికి తెలుగు సినీ పరిశ్రమ ఈమధ్య సాఫ్ట్ కార్నర్ అయిపోతుంది. ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీ ని ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ ఈ సంసృతికి తెరలేపగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దానిని కొనసాగిస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో సినీ హీరోనే ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు కాబట్టి, ఇక్కడ మాత్రం ఇండస్ట్రీ కి లబ్ది చేకూరేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.