మారథాన్‌లో రోబోట్‌ల ప్రత్యేకత
మారథాన్‌లో పాల్గొనే రోబోట్‌లు ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. వీటిని 20కి పైగా కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్‌లు మానవుల మాదిరిగా కనిపించడంతో పాటు పరుగెత్తే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ రోబోట్‌లు 0.5 మీటర్లు నుంచి 2 మీటర్ల ఎత్తులో ఉండవచ్చు. మోకాళ్లు, కాళ్ల పొడవు, నడక తీరును మానవులతో సమానంగా ఉండేలా రూపొందించారు. రోబోట్‌ల పనితీరు సజావుగా ఉండేందుకు ప్రత్యేక బ్యాటరీలు అందుబాటులో ఉంచారు. రేసు మధ్యలో వాటిని భర్తీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ రేసులో రిమోట్ కంట్రోల్, ఆటోమేటెడ్ రోబోట్‌లు రెండూ పాల్గొనవచ్చు.
టియాంగాంగ్ రోబోట్ విశేషాలు
ఈ ఈవెంట్‌లో టియాంగాంగ్ హ్యూమనాయిడ్ రోబోట్ అనే ప్రత్యేక రోబోట్ కూడా పాల్గొననుంది. ఇది చైనా ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేయబడింది. గంటకు సగటున 10 కిలోమీటర్ల వేగంతో ఇది ముందుకు కదలగలదు. గతంలో ఈ రోబోట్ హాఫ్ మారథాన్‌లో పాల్గొని తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
మారథాన్ ప్రత్యేకత
ఈ మారథాన్‌లో మానవులు లేదా రోబోట్‌లను విభజించడం లేదు. దాంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేస్తారు. మానవ-రోబోట్ మేళవింపుతో జరిగే ఈ రేసు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.
చైనా రోబోట్‌ల అభివృద్ధి వెనుక కారణం
చైనాలో వృద్ధాప్య జనాభా పెరుగుతోన్న నేపథ్యంలో శ్రామిక శక్తి కొరత పెద్ద సమస్యగా మారింది. జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక ప్రగతిని ఉంచేందుకు చైనా రోబోటిక్స్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం, చైనా 2023లో ప్రపంచ రోబోట్స్ ఉపయోగంలో 51శాతం వాటాను కలిగి ఉంది. దీని ద్వారా ప్రొడక్టివిటీ పెంచడంతో పాటు పలు రంగాల్లో రోబోట్‌ల వినియోగాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.
చైనాలో రాబోయే మార్పులు
రోబోట్‌లతో మారథాన్ నిర్వహించడమే కాకుండా, చైనా రాబోయే రోజుల్లో ఇతర క్రీడా విభాగాల్లో కూడా రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మారథాన్ ప్రపంచానికి సాంకేతికత వలన మనుషులకు కలిగే ఉపయోగాన్ని తెలియజేసే చిహ్నంగా నిలుస్తుందని నిశ్చయంగా చెప్పవచ్చు. అమెరికాతో సాంకేతిక పోటీలో ఆధిక్యత సాధించడానికి చైనా కృత్రిమ మేధస్సు, రోబోటిక్‌లను అభివృద్ధి చేయడానికి తన ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. తగ్గుతున్న జనన రేటు, వృద్ధాప్య జనాభాతో సతమతమవుతున్న చైనా, రోబోలను చాలా ముఖ్యమైనవిగా భావిస్తుంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. 2023 నాటికి చైనా కస్టమర్లు 276,288 రోబోలను లేదా ప్రపంచంలోని మొత్తంలో 51 శాతం ఇన్‌స్టాల్ చేసి ఉంటారు.