Dil Raju Wife : నేడు ఉదయం నుండి సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న ఘటన యావత్తు సినీ లోకాన్ని షాక్ కి గురి చేసింది. ముందుగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మైన్ దిల్ రాజు ఇంటి పై సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు ఆయన ఇంటి వద్ద ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆయన కూతురు ఇంటి పై సోదాలు నిర్వహించారు. ఇక దిల్ రాజు భార్య పేరిట వేసిన డిపాజిట్స్ పై కూడా ఐటీ అధికారులు అనేక ప్రశ్నలు వేసి విచారణ జరిపించారు. నేరుగా ఆమెని బ్యాంక్ కి తీసుకెళ్లి లాకర్లు తెరిపించి లెక్కలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏమి జరిగింది, ఎలాంటి విషయాలు బయటపడ్డాయి వంటి అంశాలు తెలియాల్సి ఉంది. దిల్ రాజు తో పుష్ప 2 నిర్మాతలపై, దేవర మూవీ ఫైనాన్షియర్స్ పై, అదే విధంగా ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వం లో FDC చైర్మన్ గా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆయనపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ పై కన్నెర్ర చేసిందంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాగార్జున N కన్వెన్షన్ మాల్ ని కూల్చేయడం, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, ఇప్పుడు వరుసగా సినీ నిర్మాతలపై ఐటీ దాడులు జరిపించడం వంటివి జరుగుతున్నాయి. అయితే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లాగ ఈ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి టార్గెట్ చేసినట్టు అందరికీ అనిపిస్తుంది కానీ బలమైన ఆధారం, కారణం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అనేది వాస్తవం. గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు తమ సినిమాల పోస్టర్స్ లో కలెక్షన్స్ ని ప్రింట్ చేయడం ఆనవాయితగా మారిపోయింది.
మొదటి రోజు 200 కోట్లు వచ్చాయని, వారం రోజుల్లో వెయ్యి కోట్లు వచ్చాయని ఇలా ప్రచారం చేసుకుంటూ తమ సినిమాలకు పబ్లిసిటీ చేస్తున్నారు. ఇవన్నీ నిజమేనేమో అనుకొని ఐటీ అధికారులు అప్పుడప్పుడు ఇలాంటి సోదాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే నేడు ఒక్కసారిగా అందరి పై టార్గెట్ చేశారు. సినీ నిర్మాతలు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలతో కలిపి మొత్తం మీద 200 మందిపై నేడు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుస్తుంది. దిల్ రాజు మొదటి నుండి ఇలాంటి లెక్కల విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. ఎప్పటికప్పుడు టాక్సులు కడుతూ చాలా క్లీన్ ఇమేజ్ ని మైంటైన్ చేస్తూ ఇన్ని రోజులు ఇండస్ట్రీ లో నెట్టుకొచ్చాడు. ఐటీ అధికారులు సోదాలు పూర్తి చేసిన తర్వాత కూడా ఆయన క్లీన్ చిట్ తో బయటకి వస్తాడని ఇండస్ట్రీ లో అతని సన్నిహితులు చెప్తున్నారు.