https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి ప్రభాస్ కాంబోలో రానున్న భారీ మల్టీ స్టారర్ సినిమా…డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న సందర్భంలో ప్రతి ఒక్క దర్శకుడు కూడా మల్టీ స్టారర్ సినిమా చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 / 09:52 AM IST

    Chiranjeevi(24)

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సత్తా చాటుతూ సినిమాలు చేస్తూ ఒక సామాన్య మానవుడు కూడా స్టార్ హీరోగా ఎదగవచ్చు అని చూపించిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి…ఈయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించే సినిమాలను చేస్తూ ముందుకు దూసుకు వచ్చాడు. వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్లను దక్కించుకున్న ఏకైక హీరోగా కూడా చిరంజీవి పేరు చరిత్రలో నిలిచిపోయింది… ఇలాంటి చిరంజీవి ప్రస్తుతం ఈ ఏజ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాహుబలి సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ తనదైన మార్కును చూపిస్తూ ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన చేసే సినిమాలన్నీ కూడా ప్యాన్ ఇండియాలో భారీ వసూళ్లను రాబడటమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను కూడా సంపాదించి పెట్టాయి. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి, ప్రభాస్ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతుందంటూ గత కొద్ది రోజులుగా చర్చలైతే జరుగుతున్నాయి.

    ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా చేసే దర్శకుడు ఎవరు అనేదానిమీద ప్రస్తుతానికైతే విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో చేయబోయే సినిమాలో చిరంజీవి ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇది నిజమైతే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్క అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ కి చిరంజీవికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. కాబట్టి వీళ్ల కాంబినేషన్ లో సినిమా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

    ఇక ప్రస్తుతానికైతే ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ అనే సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ వర్మతో సినిమా ఉంటుందా? లేదా అనే విషయాన్ని కూడా తెలియజేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…