iSmart Jodi 3
iSmart Jodi 3 : బుల్లితెర పై ఎంటెర్టైమెంట్ షోస్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ షోస్ కోసం టీవీ ని చూసే ఆడియన్సు కోట్లలో ఉంటారు. అందుకే వీటికి విపరీతమైన క్రేజ్ ఈమధ్య కాలంలో ఏర్పడింది. స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఏడాది బిగ్ బాస్ రియాలిటీ షో మొదలయ్యే ముందు, ఓంకార్ కి సంబంధించి ఎదో ఒక షో ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ ఏడాది అలా ‘ఇస్మార్ట్ జోడి 3′(Ismart Jodi 3) షో మన ముందుకు వచ్చింది. ప్రస్తుతం అన్ని టీవీ చానెల్స్ లో ప్రసారం అవుతున్న ఎంటర్టైన్మెంట్ షోస్ కంటే, ఈ షోకి మాత్రమే అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయట. గత వారం ఈ షో కి దాదాపుగా అర్బన్ + రూరల్ ప్రాంతాలకు కలిపి 4.34 రేటింగ్స్ వచ్చాయట. ఇదే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోస్ లో నెంబర్ 1 గా నిలిచిందని అంటున్నారు.
అదే విధంగా స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఆదివారం టెలికాస్ట్ అయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం'(Aadivaram With Star Maa Parivaram) షో కి 3.55 టీఆర్పీ రేటింగ్స్ ని సాధించి రెండవ స్థానంలో నిల్చింది. వివిధ టీవీ సీరియల్స్ కి సంబంధించిన సెలబ్రిటీస్, ఈ షోలో రెండు గ్రూపులుగా ఏర్పడి ఆడే ఆటలకు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో, ముక్కు అవినాష్, హరి వంటి వారు కో హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు చేసే సందడి మామూలు రేంజ్ లో ఉండదు. స్టార్ మా ఛానల్ నుండి కేవలం ఈ రెండు ఎంటర్టైన్మెంట్ షోస్ కి మాత్రమే రేటింగ్స్ వస్తున్నాయి. మిగిలినవి మొత్తం ఈటీవీ కి సంబంధించిన షోస్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రతీ ఆదివారం మధ్యాహ్నం టెలికాస్ట్ అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) షో కి గత వారం 2.67 రేటింగ్స్ ని సాధించి మూడవ స్థానంలో నిల్చింది.
ఇక ఆ తర్వాత ఎన్నో ఏళ్ళ నుండి విరామం లేకుండా టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్(Jabardasth) కామెడీ షో కి గత వారం 2.41 రేటింగ్స్ రాగా, సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్స్'(Family Stars) షో 2.32 రేటింగ్స్ ని సాధించి ఐదవ స్థానంలో నిల్చింది. ఇక ఆ తర్వాత ఢీ డ్యాన్స్(Dhee Dance Show) షో కి 2.10 టీఆర్ఫీ రేటింగ్స్ రాగా, సుమ అడ్డకు(Suma Adda) 1.66 రేటింగ్స్ వచ్చాయి. ఇక అన్నిటికంటే చివరి స్థానంలో ప్రతీ సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారమే పాడుతా తీయగా(Padutha Theeyaga) షోకి దక్కిందని అంటున్నారు. ఈ షో కి గత వారం లో 1.64 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. చూస్తుంటే ఈ వారం లో కూడా ‘ఇస్మార్ట్ జోడి 3’ నే టాప్ స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
Also Read : ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ సీజన్ 2 ప్రారంభం తేదీ వచ్చేసింది..ఈ షో నుండి ఇద్దరు ‘బిగ్ బాస్ 9’ ఎంపిక!
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Ismart jodi 3 trf ratings analysis
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com