Kirak Boys and Kiladi Ladies : ఈమధ్య కాలం ఎంటర్టైన్మెంట్ షోస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది స్టార్ మా ఛానల్. ఇంతకు ముందు ఈటీవీ లో ఎంటర్టైన్మెంట్ షోస్ నిండుగా ఉండేది. కానీ ఇప్పుడు స్టార్ మా ఛానల్ ఈటీవీ ని డామినేట్ చేస్తుంది. గత ఏడాది స్టార్ మా ఛానల్ లో ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ అనే ప్రోగ్రాం టెలికాస్ట్ అయ్యి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ షో నుండి విష్ణు ప్రియా, ప్రేరణ, నిఖిల్, టేస్టీ తేజ వంటి వారు బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8 Telugu) లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ షోకి రెండవ సీజన్ ప్రారంభం వచ్చే నెల నుండి కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో ని కూడా ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు.
మొదటి సీజన్ లో న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి శేఖర్ మాస్టర్, అనసూయ ఈ సీజన్ లో కూడా కొనసాగుతున్నారు. ఇకపోతే ఈ సీజన్ లో రవి కృష్ణ, శివ, పృథ్వీ, బంచిక్ బబ్లూ వంటి మేల్ కంటెస్టెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అదే విధంగా లేడీస్ నుండి దెబ్ జాన్ మోదక్, రోహిణి వంటి వారు ఉన్నారు. వీరిలో దెబ్ జాన్ మోదక్, బంచిక్ బబ్లూ వంటి వారు బిగ్ బాస్ సీజన్ 9 కి ఎంపిక అయ్యినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఈమె రవి కృష్ణ, శివ వంటి వారు కూడా ఈ సీజన్ 9 లోకి రాబోతున్నారట. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో ‘ఇష్మార్ట్ జోడి 3 ‘(ismart jodi 3) విజయవంతంగా కొనసాగుతుంది. ఈ షో పూర్తి అవ్వగానే, ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ రెండవ సీజన్ మొదలు అవుతుందని అంటున్నారు. ఈ సీజన్ కి కూడా యాంకర్ గా శ్రీముఖి వ్యవహరించబోతుంది.
Also Read : ప్రైజ్ మనీ లో భారీ కోత..హౌస్ లో కంటెస్టెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడినందుకు బిగ్ బాస్ ఎంత ఫైన్ వేశాడో తెలుసా!