Venkatesh Trivikram New Movie Updates: సినిమా ఇండస్ట్రీ పేరు చెప్తే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్లే స్క్రీన్ మీద కనిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లను చూసి జనాలు థియేటర్ కి వస్తుంటారు. అందుకే సినిమా ఇండస్ట్రీ లో ఏ క్రాఫ్ట్ వాళ్లకు దక్కని గొప్ప గుర్తింపు నటులకు మాత్రమే దక్కుతోంది. అందులో హీరోలకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్లు చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికి ఆయన ఫ్యామిలీ సబ్జెక్టులను చేస్తూనే కొన్ని డిఫరెంట్ సబ్జెక్టులను సైతం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈరోజే ఈ సినిమా స్టార్ట్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిజానికి త్రివిక్రమ్ ఇంతకు ముందు చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మరి అదే కథతో ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ కథ ఈ కథ రెండు ఒకటేనా? లేదంటే వెంకటేష్ కోసం సెపరేట్ గా కొత్త స్టోరీ రాసుకున్నాడా అనేది తెలియాలంటే మాత్రం ఈ విషయం మీద త్రివిక్రమ్ స్పందించాల్సిన అవసరమైతే ఉంది.
Also Read: రజినీకాంత్ హీరోగా రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడా..? కారణం ఏంటంటే..?
ఇక త్రివిక్రమ్ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ కి కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే మార్కెట్ అయితే ఉంది. ఈ సినిమాతో తనతో పాటు వెంకటేష్ ని కూడా పాన్ ఇండియాకి పరిచయం చేసి ఇండియాలో వీళ్ళిద్దరూ మంచి గుర్తింపును సంపాదించుకోగలుగుతారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక వెంకటేష్ ఈ సంవత్సరం స్టార్టింగ్ లో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 300 కోట్ల కలెక్షన్స్ అందుకొని సీనియర్ హీరోల్లో స్టార్ హీరోగా నిలిచాడు. ఇక అదే రీతిలో ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా కోసం భారీ కసరత్తులను చేసి మరోసారి తన ఖాతాలో భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…