Rajinikanth Retirement: ప్రస్తుతం 74 సంవత్సరాల వయసులో ఉన్న రజనీకాంత్ ఎక్కడ తగ్గకుండా యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు అంటే అతనికి సినిమాలు అంటే ఎంత పిచ్చోమనం అర్థం చేసుకోవచ్చు… ఇక ప్రస్తుతం ఆయన సోలో హీరోగా ఎక్కువ సినిమాలు చేయాలనుకోవడం లేదట. మహా అయితే ఇంకో రెండు మూడు సినిమాలు చేసి హీరో గా చేయడం మానేసి ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ దొరికితే చేద్దామనే ఆలోచనలో రజనీకాంత్ ఉన్నారట. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కూలీ’ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన చివరగా చేయబోతున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత రాబోతున్న ‘జైలర్ 2’ సినిమా విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… మొదటి పార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధించిందో రెండో పార్ట్ అంతకు మించిన సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…అలాంటి రజనీకాంత్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని సూపర్ సక్సెస్ గా నిలుపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే జైలర్ 2 విషయంలో డైరెక్టర్ నెల్సన్ సైతం భారీ కాన్ఫిడెంట్ గా ఉన్నారట.
Also Read: చిరంజీవి చేయాల్సిన సూపర్ హిట్ సినిమాను రజినీకాంత్ చేసి సూపర్ స్టార్ అయ్యాడా..?
ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నెల్సన్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా రజినీకాంత్ కు ఏ రేంజ్ సక్సెస్ ని కట్టబెడతాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడమే కాకుండా రజినీకాంత్ స్టైల్ ను హైలెట్ చేస్తూ ఒక సీక్వెన్స్ అయితే ఉండబోతుందట.
ఆ సీక్వెన్స్ ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా మారబోతోంది అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి నెల్సన్ సైతం ఈ సినిమా కోసం అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. మొత్తానికైతే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలపడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ సీనియర్ హీరోకి దక్కని గొప్ప గుర్తింపును ఈ సినిమాతో రజనీకాంత్ కి కట్టబెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది…