Manchu Manoj: తెలుగు ప్రేక్షకుల మదిలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు విలన్ గా, హీరోగా అభిమానుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. అటు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ సైతం పరిశ్రమలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
వీరిలో మంచు మనోజ్ విషయానికి వస్తే ఆయన హీరోగా మంచి విజయాలను అందుకున్నారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వివాహ జీవితాన్ని గడుపుతున్న మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఓ వార్త హల్ చల్ చేసింది.
మంచు మనోజ్ రాజకీయ ప్రవేశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఈ నేపథ్యంలోనే మనోజ్ కు, తన తండ్రి మోహన్ బాబుకు మధ్య వివాదం రాజుకుందేమోనంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటున్నారన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అటు మనోజ్ సతీమణి మౌనిక రెడ్డి ఫ్యామిలీ టీడీపీకి చెందిన వారు.
ఈ క్రమంలోనే మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే తన తండ్రి మోహన్ బాబు మద్ధతు ఇస్తున్న వైసీపీకి సపోర్ట్ చేస్తారా? లేక భార్య మౌనిక రెడ్డి ఫ్యామిలీ విధేయులుగా ఉన్న టీడీపీకి సపోర్ట్ చేస్తారా? అనే ప్రశ్న పలువురి మదిలో మెదులుతోంది. మరోవైపు భార్య మౌనికరెడ్డి కోసం మనోజ్ టీడీపీలోకే వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల మనోజ్ తన భార్యకు తోడుగా ఉంటానని చెప్పడంతో తండ్రికి దూరం కానున్నారంటూ న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో మనోజ్ తండ్రి మోహన్ బాబుకు దూరం కానున్నారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే మనోజ్ పొలిటికల్ ఎంట్రీ కానీ, ఆయన ఏ పార్టీకి మద్ధతు ఇస్తారనే విషయాల్లో వాస్తవాలు తెలియాల్సి ఉంది.