https://oktelugu.com/

Venkatesh: వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో లో వస్తున్న సినిమా స్టోరీ ఇదేనా..?

నిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా ఒక సినిమా ను అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఎప్పుడైతే వీళ్ళ కాంబినేషన్ ని దిల్ రాజు సెట్ చేశాడో అప్పటినుంచి ఈ సినిమా మీద ప్రేక్షకులకు మంచి నమ్మకం ఏర్పడింది.

Written By:
  • Gopi
  • , Updated On : February 4, 2024 / 01:13 PM IST
    Follow us on

    Venkatesh: కొంతమంది కొన్ని రకాల పాత్రల్లో మాత్రమే నటిస్తారు. ప్రేక్షకులు కూడా వాళ్ళని దానికే పరిమితం చేస్తూ ఉంటారు. కానీ ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్దీ మది హీరోలు మాత్రం నవరసాలను పండిస్తూ అన్ని జనర్స్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతారు. అలాంటి వాళ్లలో విక్టరీ వెంకటేష్ ఒకరు…ఈయన మాస్, కామెడీ, హార్రర్,లవ్ ఇలా అన్ని రకాల సినిమాలు చేసి సక్సెస్ లు కూడా కొట్టారు.

    ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా ఒక సినిమా ను అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఎప్పుడైతే వీళ్ళ కాంబినేషన్ ని దిల్ రాజు సెట్ చేశాడో అప్పటినుంచి ఈ సినిమా మీద ప్రేక్షకులకు మంచి నమ్మకం ఏర్పడింది.ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 , ఎఫ్3 సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ సినిమాతో వీళ్ళ కాంబో హ్యాట్రిక్ కొట్టడం పక్క అంటూ వెంకీ అభిమానులు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నారు.

    అయితే ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కొద్దిసేపు రైతు పాత్రలో కూడా కనిపించబోతున్నడట, ఆ తర్వాత మళ్లీ సిటీలో జాబ్ చేసే పర్సన్ గా కనిపించనున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఎక్కువ భాగం విలేజ్ లోనే నడుస్తుందట. ఇక అక్కడ కామెడీ, యాక్షన్, లవ్ లాంటి ఎంటర్ టైన్ మెంట్ అంశాలన్నీ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఊర్లో ఉన్న పెద్దమనిషి కి వెంకటేష్ కి మధ్య కొన్ని గొడవలు రావడంతో వెంకటేష్ ఊరు వదిలి పెట్టి సిటీకి వచ్చి జాబ్ చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట.

    ఇక ఇలాంటి క్రమంలో తను ప్రేమించిన అమ్మాయిని చేరుకున్నాడా లేదా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని వెంకీ అనిల్ ఇద్దరు మొత్తం కామెడీతో నింపేయాలని చూస్తున్నారు. వెంకటేష్ కామెడీ లో కింగ్, అలాగే అనిల్ కూడా డబల్ మీనింగ్ లేని కామెడీ ని జనరేట్ చేయడంలో తోపు కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాతో ప్రేక్షకులకు మరోసారి హిలేరియస్ కామెడీ ని పంచబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…