Star directors race for Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీని గత 50 సంవత్సరాలుగా ముందుకు తీసుకెళుతున్న ఘనత సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లకు దక్కుతుంది… యంగ్ హీరోలతో పోటీ పడుతూ సూపర్ హిట్ సినిమాలను చేస్తున్నారంటే వీళ్ళకి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…ప్రస్తుతం సినిమా ఎలాంటిదైనా కూడా తన మార్కు ను చూపించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ నలుగురు హీరోలు ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించడం విశేషం… ఇక బాలయ్య బాబు ‘అఖండ 2’ సినిమాతో ఒక డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
నాగార్జున మాత్రం తన వందో సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక సీనియర్ హీరోలందరికి గొప్ప క్రేజ్ ఉన్నప్పటికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లను మినహాయిస్తే బాలయ్య బాబుతో ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటి అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి…
నిజానికి బాలయ్య బాబు అంటేనే మాస్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఆయనతో కమర్షియల్ డైరెక్టర్లు సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. కానీ కంటెంట్ బేస్డ్ డైరెక్టర్లు సైతం బాలయ్య బాబుతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు అందులో వివేక్ ఆత్రేయ ఒకరు. ఎందుకని తను బాలయ్యతోనే సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరిలో అనుమానాన్ని రేకెత్తిస్తుంది…
నిజానికి బాలయ్య తో సినిమా చేస్తే అటు కమర్షియల్ గా, ఇటు కంటెంట్ బేస్డ్ గా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే వివేక్ ఆత్రేయ తనతో సినిమా చేయడానికి కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక బాలయ్య కూడా ఈ డైరెక్టర్ కి అవకాశాన్ని ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ లిస్టులో హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు కూడా ఉన్నారు…