Homeఎంటర్టైన్మెంట్Yellamma movie hero rejection reason: 'ఎల్లమ్మ ' సినిమాను అంత మంది హీరోలు రిజెక్ట్...

Yellamma movie hero rejection reason: ‘ఎల్లమ్మ ‘ సినిమాను అంత మంది హీరోలు రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఇదేనా..?

Yellamma movie hero rejection reason: ‘బలగం’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు ‘వేణు ఎల్దండి’…. అప్పటివరకు కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు లో ఇంత మంచి టాలెంట్ ఉందా? అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఆయన దిల్ రాజు బ్యానర్ లోనే ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే…దాని కోసం చాలామంది హీరోలను అనుకున్నారు, కానీ వాళ్ళందరు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. కారణం ఏంటి అనే విషయం మీద ప్రతి ఒక్కరికి క్లారిటీ మిస్ అవుతుంది. నిజానికి ఒక రెండు సీన్స్ లో హీరో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించాలి ఉందట.

ఆ హీరోలు అలా చేస్తే తమ అభిమానులు గానీ, ప్రేక్షకులు వాళ్ళను ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఒకటికి రెండుసార్లు అనుకొని ఆ పాత్రల్లో మార్పులు చేయమని చెప్పారట. వేణు కుదరదని చెప్పడంతో వాళ్ళు మూవీ నుంచి తప్పుకున్నారు. మొత్తానికైతే దేవిశ్రీప్రసాద్ కి ఈ సినిమా స్టోరీ బాగా కనెక్ట్ అవ్వడంతో ఆయన చేస్తానని ముందుకు వచ్చాడు.

దిల్ రాజు కూడా దానికి ఒక చెప్పడంతో సినిమా మొత్తానికైతే పట్టాలెక్కింది. ఇంతకీ ఆ హీరోలందరు మార్చమని చెప్పిన సీన్స్ ఏంటి అంటే ఈ సినిమాలో హీరో ట్రాన్స్ జండర్ గా కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. కొన్ని ఎపిసోడ్స్ లో హీరో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో యాక్టింగ్ చేయాల్సిన అవసరమైతే ఉందట. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ కెరీర్ కి ఏదైనా ఇబ్బంది జరగవచ్చును ఉద్దేశంతోనే హీరోలు సినిమాను రిజెక్ట్ చేశారు.

అయితే దేవి శ్రీ ప్రసాద్ మాత్రం హీరోగా తన మొదటి సినిమా కాబట్టి అతను ఎలాంటి క్యారెక్టర్ చేసిన ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందనే ఉద్దేశ్యంతోనే తనను తీసుకున్నారని తను కూడా అదే అభిప్రాయంతో ఈ సినిమాకి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది…మొత్తానికి దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా మారడం ఒకెత్తయితే వేణు ఎల్దండి ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు. తద్వారా ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది మరొకెత్తుగా మారబోతోంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version