Fake box office collections: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. వాళ్ళ సినిమాలను చూడడానికి ప్రేక్షకులందరు ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి వాళ్ల సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ రావడమే కాకుండా స్టార్ ప్రొడ్యూసర్లందరు వాళ్ళతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో ఆటోమేటిగ్గా వాళ్ళ క్రేజ్ అనేది తారా స్థాయికి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ల మార్కెట్ ను పెంచుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందకపోయిన కూడా భారీ కలెక్షన్స్ సాధించాయంటు ఫేక్ కలెక్షన్ పోస్టర్లను వేస్తున్నారు. దీని వల్ల హీరోలకు పోయేదేమీ లేదు. కానీ ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలైతే వస్తున్నాయట. మా సినిమా సూపర్ హిట్ అయింది అంత కలెక్ట్ చేసింది. ఇంత కలెక్ట్ చేసిందని చెప్పడంతో ప్రొడ్యూసర్స్ మీద ఐటి రైడ్స్ జరుగుతున్నాయి.
అలాగే వాళ్లకు ఐటి డబ్బులను కూడా ఆ రేంజ్ లోనే చెల్లించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. కాబట్టి ఈ ఫేక్ కలెక్షన్స్ వల్ల వాటన్నింటికి టాక్స్ పే చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందంటూ కొంతమంది ప్రొడ్యూసర్లు సైతం వల్ల బాధలను పంచుకుంటున్నారు.
హీరోల ఇమేజ్ పక్కన పెడితే ఇక్కడ బిజినెస్ పరంగానే ప్రొడ్యూసర్లు ఒక సినిమాని చేస్తుంటారు. కాబట్టి వాళ్ల బిజినెస్ డీల్ ప్రకారం వాళ్లకు రావాల్సిన డబ్బులు వస్తే వాళ్ళు నష్టాలను చవి చూడకుండా ఉంటుంది. అంతే తప్ప హీరోలు ఇమేజ్ కోసం ప్రొడ్యూసర్ల భవిష్యత్తును పణంగా పెట్టకూడదు అంటు మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా స్టార్ ప్రొడ్యూసర్లు సైతం చిన్న హీరోలతో సినిమాలను చేసుకుంటూ చిన్న సినిమాలను కాపాడాల్సిన పరిస్థితి పోయింది. స్టార్ హీరోలు అడిగినంత వాళ్లకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టే ఇండస్ట్రీలో ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడిందని పలువు సినిమా మేధావులు అభిప్రాయపడుతున్నారు. చిన్న సినిమాను బతికించాల్సింది పోయి చిన్న సినిమాను చంపేస్తున్నారు అంటూ మరి కొంతమంది వాపోతున్నారు…