Daku Maharaj : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బంపర్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ని డైరెక్టర్ బాబీ చాలా కొత్తరకమైన స్క్రీన్ ప్లే తో నడిపించాలని ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్ అలాగే తీసాడు. బాలయ్య ని ఇలాంటి యాంగిల్ లో కూడా చూపించవచ్చా అని ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా వెండితెర పై ప్రెజెంట్ చేశాడు. ఇంటర్వెల్ సన్నివేశానికి అయితే అభిమానులు చొక్కాలు చింపుకునే పరిస్థితి ఏర్పడింది.
కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆ రేంజ్ లో తీయలేదు. చాలా సన్నివేశాలు తర్వాత ఏమి జరగబోతుంది అనేది చిన్న పిల్లలు కూడా ఊహించేంత పేలవంగా స్క్రీన్ ప్లే ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని తొందరగా ముగించి ఉండుంటే బాగుండేది అనిపించింది. మూడు రోజుల క్రితం విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం ఇంకా కాస్త ఎక్కువ ఉండుంటే బాగుండేది అనిపించింది. కానీ ‘డాకు మహారాజ్’ కి మాత్రం అందుకు పూర్తిగా రివర్స్ అభిప్రాయం. రెండు రోజుల గ్యాప్ లో విడుదలైన ఈ రెండు సినిమాల మధ్య ఇంత వ్యత్యాసం ఉండడం గమనించాల్సిన విషయం. రెండవ రోజు వసూళ్లు ‘డాకు మహారాజ్’ అనేక ప్రాంతాలలో దారుణంగా పడిపోయాయి. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఇలాంటి డ్రాప్స్ రావడానికి ప్రధాన కారణం సెకండ్ హాఫ్ లోని స్క్రీన్ ప్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
రేపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విడుదల కాబోతుంది. ఆడియన్స్ లో ఈ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. ‘గోదారి గట్టు మీద’ సాంగ్ తో పాటు, మరో రెండు సాంగ్స్ కూడా వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెంది పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడుతున్నారు. హైదరాబాద్ బుక్ మై షో యాప్ లో అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్స్ షోస్ తో నిండిపోయాయి. ‘గేమ్ చేంజర్’ , ‘డాకు మహారాజ్’ కి కేటాయించిన కొన్ని థియేటర్స్ ని కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి ఇచ్చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ మొదటి ఛాయస్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది అందరికీ అర్థమైపోయింది. రెండవ ఛాయస్ గా ‘గేమ్ చేంజర్’ ఉంది. ఇక ఈ రెండు సినిమాలకు టికెట్స్ దొరకని వాళ్ళు ‘డాకు మహారాజ్’ కి వెళ్లే పరిస్థితి ఉంది. చూడాలి మరి ఫుల్ రన్ లో ‘డాకు మహారాజ్’ ఎంత వసూళ్లను రాబడుతుంది అనేది.