Movies Vs Serial: సినిమాకి, సీరియల్ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదేనా..? సీరియల్స్ ఎక్కువ మందికి నచ్చకపోవడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు దర్శకులకు చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. వాళ్ళ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : September 17, 2024 1:59 pm

Movies Vs Serial

Follow us on

Movies Vs Serial: సినిమాల విషయంలో ప్రేక్షకుల మైండ్ సెట్ అనేది కొన్ని సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. నిజానికి రొటీన్ సినిమాలు చూస్తున్న సమయంలో ప్రేక్షకుడు ఒక కొత్తదనాన్ని కోరుకుంటుంటాడు. అలాంటి సందర్భంలో కొత్త సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. 1990 వ సంవత్సరంలో వచ్చిన ‘శివ ‘ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత తెలుగులో అలాంటి సినిమా రాలేదు అంటూ చాలామంది చాలా సంవత్సరాల పాటు కామెంట్లు చేశారు. కానీ సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి సినిమా మాత్రం శివ ప్లేస్ ని రీప్లేస్ చేసింది అంటూ మరికొంతమంది కామెంట్స్ చేయడం విశేషం…శివ వచ్చిన 30 సంవత్సరాల తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఓవర్ నైట్ లో సందీప్ రెడ్డి వంగ ను స్టార్ డైరెక్టర్ ను చేసింది. ఇక ఇదిలా ఉంటే సినిమాల విషయం ప్రేక్షకుల మైండ్ సెట్ ఒకలా ఉంటే సీరియల్స్ కి వచ్చేసరికి మాత్రం మరోలా ఉంటుంది. ముఖ్యంగా టీవీ సీరియల్స్ ని చూడడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకు అంటే సినిమాల్లో ఒక కథని దర్శకుడు రెండున్నర గంటల్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటాడు. ఇక అందులోనే ఎమోషన్స్, ఎలివేషన్స్ ఫైట్ సీక్వెన్సెస్ అన్ని చూపించి ప్రేక్షకుడిని రెండున్నర గంటల్లో అన్ని రకాల ఎమోషన్స్ ని అనుభవించేలా చేస్తూ ఉంటారు. కానీ సీరియల్స్ లో మాత్రం అలా కాదు ఒక చిన్న కథను తీసుకొని అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ ని రాసుకొని ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ ని హుక్ చేస్తూ రోజుకు ఒక 30 నిమిషాల పాటు టెలికాస్ట్ చేస్తూ అందులో ఉన్న ఎమోషన్స్ ని ప్రేక్షకుడు సగం సగం ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటారు.

నిజానికి ఇవాళ సీరియల్ లో మెయిన్ రోల్ చేసిన వాళ్ళకి అన్యాయం జరిగితే ప్రేక్షకుడు అప్పుడు మాత్రమే తనకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పటికప్పుడు ఆ అన్యాయానికి తగ్గట్టుగా రియాక్షన్ ఉంటే ఎమోషన్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది.

అలా కాకుండా దాన్ని ఇక్కడ కట్ చేసి మళ్లీ రేపు ఇదే టైమ్ కి చూపించడం వల్ల అసలు అందులో ప్రతి ప్రేక్షకుడు లీనమై పోతాడు అనేది మనం కచ్చితంగా చెప్పలేము. కాబట్టి సీరియల్ అనేది సగం సగం ఎమోషన్ తో కూడుకొని ఉంటుంది. సినిమా అనేది స్ట్రైట్ ఫార్వార్డ్ గా రెండున్నర గంటలపాటు నడుస్తూ ఉంటుంది. అందుకే సీరియల్స్ తో పోలిస్తే సినిమాలకు ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది…ఇక సినిమాకి చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. సీరియల్ కి మాత్రం అంత బడ్జెట్ పెట్టాల్సిన పని లేదు.

తక్కువ బడ్జెట్ లోనే సీరియల్ ని చుట్టేసి ఒక రకం ఎమోషన్ కి గురి చేస్తూ ఉంటారు. కాబట్టి అవి కొంతమందికి మాత్రమే నచ్చుతూ ఉంటాయి. కానీ సినిమా పరిధి పెద్దగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేసే విధంగా దర్శకుడు ఒక సినిమాని తెరకెక్కిస్తూ ఉంటాడు…