Actor Rajendran bald head: సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి స్టోరీ ఉంటుంది. ఇండస్ట్రీలో రాణించడానికి కొంతమంది హీరోలుగా మారి గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు. మరి కొంతమంది మాత్రం తమ టాలెంట్ ను ఉపయోగించుకొని ముందుకు సాగుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ‘రాజేంద్రన్’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సినిమాల్లో అతను విలన్ గా, కామెడీ విలన్ గా పాలు పాత్రలను చేసి మెప్పించాడు… ఇక తను ఎప్పుడు గుండుతోనే ఉంటాడు. కారణం ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదడుతుంది. నిజానికి ఆయన 20 సంవత్సరాల క్రితం ఒక బైక్ స్టంట్ చేసినప్పుడు ఒక కెమికల్ వాటర్ లో పడిపోయాడట. దానివల్ల అతని హెయిర్ మొత్తం లాస్ అయిపోయింది. అయినప్పటికి ఆయన ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఆ గుండు తోనే తను సినిమాలను చేసి దాని వల్లే ఆయన ఎక్కువ పాపులారిటిని సంపాదించుకున్నాడు.
ఇక తనకి గుండు ఉండడం వల్లే తనకు చాలావరకు ప్లస్ అయిందని ఇంటర్వ్యూలో సైతం ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక చాలామంది దర్శకులు సైతం అతని సినిమాల్లో తీసుకోవడానికి అతని గుండుతో ఉండడమే కారణమని చెబుతుంటారు. ఇక రాజేంద్రన్ తన మైనస్ ని సైతం ప్లస్ గా మార్చుకొని సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.
ప్రతి ఒక్కరు తమ దగ్గర ఏదో లేదని నిరుత్సాహపడే కంటే తమ దగ్గర ఉన్న దానితోనే మనసుపెట్టి పని చేస్తే సక్సెస్ ని సాధించవచ్చు అని చెప్పడానికి ఆయన స్టోరీ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.
ఇప్పటివరకు ఆయన 500 కు పైన సినిమాల్లో నటించాడు… ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తను ఆదర్శంగా నిలుస్తున్నాడనే చెప్పాలి. కారణం ఏదైనా కూడా మన మైనస్ ను ప్లస్ గా మార్చుకోవడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
చాలామంది చిన్న ప్రాబ్లం ఎదురైనా కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి తీవ్రమైన మనోవేదనను అనుభవిస్తూ ఉంటారు. కానీ కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి మనం ముందుకు అడుగు వేస్తే సక్సెస్ అనేది మనకు ఈజీగా చేరువవుతుందని చెప్పడానికి రాజేంద్రన్ ను మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు…