Pradosha Kalam: మనుషులకు అదనపు శక్తి కావాలంటే దైవారాధన ముఖ్యం అని పండితులు చెబుతూ ఉంటారు. అయితే దైవ అనుగ్రహం కోసం సాధారణ రోజుల్లో కాకుండా ప్రత్యేక సమయాల్లో ప్రత్యేక పూజలు చేయడం వల్ల వారి నుంచి ఆశీస్సులను పొందే అవకాశం ఉంటుంది. ముల్లోకాలన్నీ శివుడి మధ్య ఉంటాయని.. ఏ లోకంలో శివారాధన చేసిన వెంటనే స్పందించి భక్తులను వెంటనే కాపాడుతాడని నమ్ముతారు. అయితే ఆ బోలా శంకరుడి అనుగ్రహం కోసం సాధారణ సమయంలో కంటే ప్రదోషకాలంలో పూజలు చేయాలని హిందూ పురాణం తెలుపుతుంది. ప్రతి వారంలో బుధ, గురువారాలు విశేషమైనవి. ఈరోజుల్లో ప్రదోషకాలంలో శివనామ స్మరణ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం వెంటనే పొందవచ్చని చెబుతున్నారు. అసలు ప్రదోషకాలం అంటే ఏమిటి? ఏ సమయాన్ని ప్రదోషకాలం అని అంటారు?
హిందూ పురాణాల ప్రకారం ప్రదోషకాలం శివ భక్తులకు అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో శివారాధన చేసి స్వామివారి అనుగ్రహం పొందుతారు. ఒక రోజులో సూర్యుడు అస్తమించే ముందు.. చీకటి మొదలయ్యే సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఉదాహరణకు సూర్యాస్తమానికి ముందు 1.5 గంటలు.. తర్వాత 1.5 గంటలు ఉంటుంది. ఈ మూడు గంటల సమయాన్ని ప్రదోషకాలం అని అంటారు. స్థానిక కాలాన్ని బట్టి సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉన్న కాలాన్ని ప్రదోషకాలం అని అంటారు. ఈ సమయంలో శివుడు నందీశ్వరుడు పై వివరిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఈ సమయాన్ని భక్తులు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు.
తెలుగు పంచాంగం ప్రకారం శుక్ల ప్రదోషం, కృష్ణ ప్రదోషం రోజుల్లో శివుడికి ప్రత్యేక పూజలు చేయవచ్చని అంటారు. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. అంటే నీరు, పాలు తేనె బిల్వ పత్రాలతో పూజలు చేయడం మంచిది. ఇదే సమయంలో దీపారాధన చేసి ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ప్రదోష వ్రతం పాటించేవారు ఈరోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివపూజ చేసిన తర్వాత ప్రసాదం తీసుకుంటారు. ఈ శివ పూజ చేసే సమయంలో ప్రదోష వ్రత కథ వినడం మంచిది అని అంటుంటారు.
ప్రదోషకాలంలో శివపూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. గతంలో చేసిన పాపాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ప్రతి వారంలో సోమవారం, శనివారం రోజున ప్రదోష కాలంలో పూజలు చేయడం మంచిది అని అంటున్నారు. అయితే ప్రదోష వ్రతం పాటించేవారు అనవసరంగా కోపాన్ని తెచ్చుకోవడం, మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.