https://oktelugu.com/

Mahesh Babu-Rajamouli movie : మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత కేవలం పాన్ వరల్డ్ సినిమాలే చేయాలా..?మరి దర్శకుల పరిస్థితి ఏంటి..?

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు... ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది... ఇక ఇప్పటికే సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆయన తండ్రికి తగ్గు తనయుడిగా ఎదగడమే కాకుండా ఇకమీదట రాబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకొని నెంబర్ వన్ హీరో పొజిషన్ ని సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 03:15 PM IST

    Mahesh Babu-Rajamouli movie

    Follow us on

    Mahesh Babu-Rajamouli movie :  సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళితో చేయబోయే సినిమా సంక్రాంతి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా చేసుకొని వరల్డ్ లెవెల్లో తనను తాను పరిచయం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి సైతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నాడు కాబట్టి ఇప్పుడు పాన్ వరల్డ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక రాజమౌళితో చేయబోయే సినిమా సూపర్ సక్సెస్ అయితే మహేష్ బాబు చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే పాన్ వరల్డ్ లో తీసిన సినిమా కాబట్టి ఆ కలెక్షన్స్ ని అంచనా వేస్తూ తన తరువాత చేయబోయే సినిమాలు కూడా ఆ రేంజ్ లోనే ఉండాల్సిన అవసరమైతే ఉంది. ఇక అలాగే ఆయన ఇమేజ్ కి సరిపడా కథను కూడా తను ఎంచుకోవాలి.

    మరి అలాంటి దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం ఇక తనకు తిరుగులేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి మిగతా దర్శకులకు పాన్ వరల్డ్ లో మహేష్ బాబు క్రేజ్ కి తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించే సత్తా ఉందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయడం ఒకేత్తేతే ఆ తర్వాత మళ్లీ సక్సెస్ అందుకోవడం కూడా మరొక ఎత్తు అవుతుందనే చెప్పాలి.

    ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబుకి రాజమౌళి బానరీ సక్సెస్ ని ఇచ్చినా కూడా అది ఒక శాపం గానే మారబోతుందని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి మహేష్ బాబు ఈ సిచువేషన్ ని ఎలా ఎదుర్కొంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే… చూడాలి మరి ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…