https://oktelugu.com/

Devara Movie Story : మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్.. ఏంటి సామీ ఇదీ.. ‘దేవర’ స్టోరీ ఇలా ఉండబోతుందా?

దేవర మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు సంబంధించిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఈమేరకు తీర ప్రాంతాల్లో భూములపై విలన్ పాగా వేసిన తరుణంలో ఆ భూములను రక్షించేందుకు దేవర ఫైట్ చేస్తాడని అర్థమవుతోంది. అయితే ఇప్పటి వరకు సినిమా గురించి, సెట్స్ గురించి ఎక్కడా లీకులు లేవు. ఈ నేపథ్యంలో దేవర ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురరుచూస్తున్నారు

Written By:
  • Srinivas
  • , Updated On : August 27, 2024 / 10:58 AM IST

    Devara Movie Story

    Follow us on

    Devara Movie Story : జూనియర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘దేవర’ మూవీపై ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ వచ్చే నెలలో 27న థియేటర్లోకి రాబోతుంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే విదేశీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఆమె అందచందాలతో ఫ్యాన్స్ ను అలరిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న సాంగ్ ప్రోమోను కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే ‘దేవర’ స్టోరీ గురించి ఇండస్ట్రీ వైజ్ గా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫోటోలు, కొన్ని వీడియోలను బట్టి చూస్తే ఈ స్టోరీ గురించి ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే?

    వరుస చిత్రాలు విజయం సొంతం చేసుకున్న కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ తో రెండో సినిమా తీస్తున్నాడు. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండో సినిమాపై కూడా హోప్స్ పెరిగాయి. అయితే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసే కొరటాల శివ ‘దేవర’ను ఏ విధంగా మలిచారోనని ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు స్టోరీపై అంచనా వేస్తున్నారు. ఈ మూవీ ఎక్కువగా సముద్ర తీర ప్రాంతంలోని గ్రామాల గురించి ఉంటుందని ఎక్స్ పెక్టెషన్ చేస్తున్నారు. సముద్ర తీరాన ఉన్న గ్రామాల్లోని ప్రజల అస్తిత్వం కోసం దేవర పోరాడుతారని అంటున్నారు. అయితే సినిమా రిలీజ్ అయితే గానీ అసలు విషయం అర్థం కాదు.

    ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు సంబంధించిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఈమేరకు తీర ప్రాంతాల్లో భూములపై విలన్ పాగా వేసిన తరుణంలో ఆ భూములను రక్షించేందుకు దేవర ఫైట్ చేస్తాడని అర్థమవుతోంది. అయితే ఇప్పటి వరకు సినిమా గురించి, సెట్స్ గురించి ఎక్కడా లీకులు లేవు. ఈ నేపథ్యంలో దేవర ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురరుచూస్తున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ అయితే స్టోరీ కాన్సెప్ట్ అర్థమవుతుందని కొందరు అంటున్నారు.

    అయితే సినిమా టైం దగ్గరపడుతున్న కొద్దీ మూవీకి సంబంధించి ప్రమోషన్ ను ఇంకా స్టార్ట్ చేయకపోవడంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే దేవర లో కంటెంట్ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను చూసిన తరువాత ప్రేక్షకులే డిసైడ్ చేస్తారనే ధీమాలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ కు సంబంధించిన లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వీటిని బట్టి చూస్తే ఇందులో ఆయన స్టైల్ తో పాటు యాక్షన్ కూడా కొత్తగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    మరోవైపు పీరియాడ్రిక్ తరహాలో ఓ సెట్ నెట్టింటా వైరల్ అవుతోంది. దీనిని బట్టి చూస్తే ఇందులో ప్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని అనుకుంటున్నారు. రెండు కథల్లో ఎన్టీఆర్ రెండు లుక్ లో ఉంటారని అంచనావేస్తున్నారు. కానీ డబుల్ రోల్ గురించి ఎక్కడా వివరాలు బయటకు రాలేదు.