Mahesh Babu Rajamouli movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయిలో అత్యంత గొప్పగా చూపించిన దర్శకుడు రాజమౌళి… ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా చూసుకుంటాడు. ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు కూడా సూపర్ సక్సెసు లను సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి ఐడెంటిటి సంపాదించుకుంటాడు తద్వారా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా నుంచి ఒక్కటి కూడా సరైన అప్డేట్ అయితే రావడం లేదంటూ చాలామంది మహేష్ బాబు అభిమానులు సైతం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దసర రోజు ఈ సినిమా నుంచి మహేష్ బాబు పోస్టర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడు మహేష్ బాబు ఫుల్ లుక్ లో ఈ పోస్టర్ ను అయితే రిలీజ్ చేస్తారట. ఇంతకు ముందు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు మెడలో ఉన్న లాకెట్ ను మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తూ పోస్టర్ ను అయితే రిలీజ్ చేశారు. దాని వల్ల అభిమానులు ఎలాంటి సంతృప్తి పొందలేకపోయారు.
కానీ ఇప్పుడు మాత్రం మహేష్ బాబు లుక్కుతో ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ దసర కి మహేష్ బాబు అభిమానుల్లో ఆనందాన్ని చూడాలని రాజమౌళి కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది… తను అనుకున్నట్టుగానే ఈ దసర కి పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఏ సినిమాకి కేటాయించనటువంటి బడ్జెట్ ను ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు… కాబట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి అని ప్రతి ఒక్కరి మదిలో ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది…ఇక అందరి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం 2027 వ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే…