Kajal Son: హీరోయిన్ కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ లో వివాహం చేసుకుంది. 2020 అక్టోబర్ లో అత్యంత సన్నిహితుల మధ్య కాజల్-గౌతమ్ కిచ్లు వివాహం జరిగింది. ఆలస్యం చేయకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. 2022 ఏప్రిల్ లో కాజల్ పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. కాజల్ తన కొడుక్కి నీల్ అని పేరు పెట్టింది. ఈ పేరు అర్థం ఏమిటో? ఆ పేరు పెట్టడం వెనుక కారణం ఏమిటో? ఇటీవల కాజల్ తెలియజేసింది. కాజల్, గౌతమ్ శివభక్తులు అట. అందుకే శివుని పేరు పెట్టాలనుకున్నారట.
శివునికి అనేక పేర్లు ఉండగా వాటి నుండి నీలకంఠను ఎంచుకున్నారట. ఇక మోడ్రన్ గా ఉండాలని, పిలవడానికి, రాయడానికి అనుకూలంగా నీల్ అని పెట్టారట. ఇక భర్త సర్ నేమ్ అయిన కిచ్లు కలిపి నీల్ కిచ్లు చేశారు. తల్లయ్యాక కాజల్ కొద్దిరోజులు ఇంటి వద్దే ఉన్నారు. ఆలనాపాలనా చూసుకున్నారు. కొన్ని సందర్భాల్లో కొడుకును వదిలేసి షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చేదట. ఆ సమయంలో మనసంతా కొడుకు మీదే ఉండేదట. ఆది కష్టమైన పని అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కాజల్ జోరు తగ్గలేదు. ఆమె బాలకృష్ణకు జంటగా భగవంత్ కేసరి చిత్రం చేస్తున్నారు. కెరీర్లో ఫస్ట్ టైం కాజల్-బాలయ్య జతకట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. భగవంత్ కేసరి ప్రోమోలు ఆకట్టుకుంటున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెరిగాయి. భగవంత్ కేసరి చిత్రంలో శ్రీలీల మరొక హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.
కాజల్ చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన ఈ మూవీ గత ఏడాది పట్టాలెక్కింది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి కొనసాగింపు. కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ ప్రీత్ నటిస్తుంది. భారతీయుడు 2 మూవీలో సిద్ధార్థ్ సైతం నటిస్తున్నారు. మరో 20 రోజులు షూటింగ్ మిగిలి ఉండగా 2024 సమ్మర్ కి విడుదలయ్యే అవకాశం కలదు. భారతీయుడు 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.