Sadha: హీరోయిన్ సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె బుల్లితెర మీద సందడి చేస్తున్నారు. తెలుగు డాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. బీబీ జోడి ముగియగా… ఇటీవల నాతోనే డాన్స్ పేరుతో మరో సెలబ్రిటీ డాన్స్ షో స్టార్ట్ అయ్యింది. శ్రీముఖి యాంకర్ కాగా రాధా, తరుణ్ మాస్టర్ లతో పాటు సదా జడ్జిగా ఉన్నారు. అప్పుడప్పుడు ఆమె జబర్దస్త్ లో కూడా కనిపిస్తున్నారు. గతంలో సదా పలు తమిళ్, తెలుగు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించారు.
చాలా గ్యాప్ అనంతరం ఇటీవల అహింస మూవీలో కనిపించారు. దర్శకుడు తేజా తెరకెక్కించిన అహింస చిత్రంలో ఆమె కీలక రోల్ చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ హీరోగా నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సదాను హీరోయిన్ గా పరిచయం చేసిన దర్శకుడు తేజ ఆమెను సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా లాంచ్ చేయడం విశేషం.
2002లో విడుదలైన జయం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫుల్ ఫార్మ్ లో ఉన్న తేజ కొత్తవాళ్లతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. జయం నెలల తరబడి థియేటర్స్ లో మోతమోగించింది. హీరో నితిన్ కి కూడా ఇదే డెబ్యూ మూవీ. జయం సదాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. యూత్ లో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. జయం తమిళంలో రీమేక్ చేశారు. అక్కడ కూడా విజయం సాధించింది. దీంతో తెలుగు, తమిళ భాషల్లో సదా బిజీ అయ్యారు.
ఎన్టీఆర్, బాలయ్య, విక్రమ్ వంటి స్టార్ హీరోల పక్కన ఛాన్స్ దక్కించుకుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు మూవీలో సదా హీరోయిన్ గా నటించారు. అగ్రహారం బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో సదా మెప్పించింది. జయం తర్వాత సదా కెరీర్లో అపరిచితుడు బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో అపరిచితుడు భారీ హిట్ కొట్టింది. అయితే కెరీర్ ప్లాన్ చేసుకోవడంలో తడబడిన సదా త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తుంది. తాజాగా రెడ్ శారీలో పరువాల ప్రదర్శన చేసింది.