Akkineni Nageshwar Rao : అక్కినేని ‘అర్దాంగి’ వెనుక అంత కథ ఉందా? పట్టు వీడని సీనియర్ నటుడు..

అక్కినేని నాగేశ్వర్ రావు జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. వీటిలో సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఎదురైన అనుభవాలు అపారం. అందుకే వీటన్నింటిని మిళితం చేసి అక్కినేని తన ఆత్మకథ రాసుకున్నారు. తన ఆత్మకథలో ఎన్నో విషయాలు చెప్పారు. ఆక్కినేని ఆత్మకథలో తన గురించి మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో జరిగిన విషయాలను ఆయన నేటి తరం వారికి వివరించి చెప్పారు

Written By: Srinivas, Updated On : July 22, 2024 9:30 am
Follow us on

Akkineni Nageshwar Rao  : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాటి నుంచి నేటి వరకు అక్కినేని నాగేశ్వర్ రావు వారసులు సినిమాల్లో కొనసాగుతున్నారు. అక్కినేని వారసులు ఆయన పేరు చెప్పుకొని అవలీలగా ఇండస్ట్రలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఆనాడు సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చింది. తెలుగు చిత్ర సీమలో ఎన్టీఆర్ తరువాత అక్కినేని నాగేశ్వర్ రావు పేరు చెప్పుకుంటారు. కానీ ఆయన ఆ స్థానంలో నిలవడనికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆయన సినీ ఎంట్రీ సమయంలో ఎన్నో అవమానాలు, బాధలు పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ఆత్మ కథలో రాసుకున్నారు. అక్కినేని ఆత్మకథలో రాసుకున్న కొన్ని విషయాలు ఆసక్తిని రేపుతాయి. ముఖ్యంగా ఒకప్పటి సినీ డైరెక్టర్లు ఎలా ఉండేవారో ఆయన చెప్పిన విషయాలను బట్టి తెలుస్తుంది. ఒకప్పుడు ఒక సినిమాకు డైరెక్టరే కింగ్ లా ఉండేవారు. వారు చెప్పిందే వేదంగా ఉండేది. అందుకే సినిమాల్లో అవకాశం రావాలంటే డైరెక్టర్ల వెంటపడేవారని కొన్ని కథలను బట్టి చూస్తే తెలుస్తోంది. ఈ మాదరిగానే అక్కినేని నాగేశ్వర్ రావు గారు కూడా అవకాశాల కోసం ముప్పు తిప్పలు పడ్డారు. ఈ తరుణంలో ఆయన ఓ డైరెక్టర్ ను కలిశాడు. ఆయనే పి. పుల్లయ్య. పి. పుల్లయ్య ఎన్నో సక్సస్ ఫుల్ సినిమాలు తీశారు. అక్కినేని స్టార్ కావడానికి పుల్లయ్యనే కారణం ని చెప్పుకుంటారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఓ విషయం ఆసక్తిరేపుతోంది.

అక్కినేని నాగేశ్వర్ రావు జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. వీటిలో సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఎదురైన అనుభవాలు అపారం. అందుకే వీటన్నింటిని మిళితం చేసి అక్కినేని తన ఆత్మకథ రాసుకున్నారు. తన ఆత్మకథలో ఎన్నో విషయాలు చెప్పారు. ఆక్కినేని ఆత్మకథలో తన గురించి మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో జరిగిన విషయాలను ఆయన నేటి తరం వారికి వివరించి చెప్పారు. ఒకప్పటి సినీ పరిశ్రమ, ఇప్పటి ఇండస్ట్రీకి ఎంత తేడా ఉందో చెప్పారు.

‘ధర్మపత్ని’ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పి. పుల్లయ్య డైరెక్టర్. అయితే ఆ సమయంలో అక్కినేని నాగేశ్వర్రావు సినీ ఇండస్ట్రీకి కొత్త. ఈ సినిమాలో నటించేందుకు చెన్నై వెళ్లి షూటింగ్ స్పాట్ లో వెయిట్ చేస్తున్నారు. అప్పటికే నాటక రంగంలో ప్రావీణ్యుడైన అక్కినేని అంటే అందరికీ నచ్చే అబ్బాయిగా ఉన్నాడు. ఈ సమయంలో డైరెక్టర్ పి. పుల్లయ్య అక్కినేనిని పిలిచాడు. తన కోసం ఓ పద్యం పాడమని అడిగాడు. వెంటనే అక్కినేని కొన్ని పదాలను వదిలాడు. దీంతో కొపం తెచ్చుకున్న పుల్లయ్య వెంటనే ఎప్పుడు అదే పద్యం పాడుతావారా? అంటూ విసుక్కుంటాడు. ఇదే సమయంలో కొన్ని అనరాని మాటలు అంటాడు. దీంతో యవ్వనంలో ఉన్న అక్కినేనికి కోపంతో పాటు బాధ కూడా కలుగుతుంది. కానీ ఏం చేయలేక అక్కడున్న మెరీనా బీచ్ లోకి వెళ్లి బాధపడ్డాడు. ఒక్కోసారి అసలు ఈ సినిమాలు వద్దురా బాబు.. అంటూ ఇంటికెళ్లాలని అనుకున్నారు. కానీ ఇదే సమయంలో అక్కడికి ఘంటసాల వచ్చి ఓదార్చారు. దీంతో తన తన మనసును మార్చుకున్నాడు.

అయితే కొన్ని రోజుల తరువాత అక్కినేని స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఆ తరువాత పి. పుల్లయ్య అక్కినేని వద్దకు కథతో వచ్చాడు. ఆ విషయం ముందే తెలుసుకున్న అక్కినేని పాత విషయాలను గుర్తు చేసుకున్నాడు. అయితే అక్కినేనిని కలుసుకున్న పుల్లయ్య కథను చెప్పాడు. అయితే ఇందులో అన్నదమ్ములు ఉంటారు. అన్న పాత్రలో ఎన్టీఆర్ ఉంటారని చెప్పారు. కానీ అక్కినేని ఒప్పుకోలేదు. తాను అన్న పాత్ర చేస్తానని అన్నాడు. కానీ పుల్లయ్య మాట్లాడుతూ అన్న పాత్రలో ఎన్టీఆర్ ఉంటారని, లేకుంటే సినీ జనాలు ఒప్పుకోరంటారు. దీంతో అక్కినేని జగ్గయ్యను చేర్చాలని అంటారు. దీంతో బాగా ఆలోచించి పుల్లయ్య ఒకే చెప్తాడు. అలా అక్కినేని తాను అనుకున్నది సాధిస్తాడు.