https://oktelugu.com/

Indian Film Industry : ఇండియా లో బెస్ట్ నటుడు ఎవరు…బెస్ట్ హీరో ఎవరు…బెస్ట్ పర్ఫర్మర్ ఎవరు..? వీటిలో తేడా ఏంటి..?

పలు సినిమాల్లో హీరోలు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తారు. కానీ ఆ సినిమాలు సక్సెస్ అవ్వవు. అయితే నటన ఒక్కటే ఇక్కడ కొలమానం కాదు. అందుకే నటన వేరు, స్టార్ డమ్ వేరు, పర్ఫామెన్స్ వేరు...

Written By:
  • Gopi
  • , Updated On : July 22, 2024 / 09:54 AM IST
    Follow us on

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ సినిమాలను చేస్తూ ముందుకు దుసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే సంపాదించుకున్నారు. మరి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న వారిలో బెస్ట్ నటుడు ఎవరు? బెస్ట్ హీరో ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? అనే విషయాల మీదనే చాలామంది కొద్ది రోజుల నుంచి కొన్ని డౌట్లను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే వాళ్ళ సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చడానికి ఆ హీరోలు ఆయా పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూ ఉంటారు. నిజానికి కొంతమంది నటులు ఆ సినిమాలను చాలా వరకు ఓన్ చేసుకొని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ నటిస్తూ ఉంటారు. మరి అలాంటి నటులు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఒక గొప్ప వరమనే చెప్పాలి. ఇక పలు సందర్భంలో కొన్ని సినిమాలు కొంతమంది నటుల పర్ఫామెన్స్ వల్ల కూడా సూపర్ హిట్లు గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి… నటుడికి, హీరోకి, పర్ఫార్మర్ కి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం…ఒక వ్యక్తి ఒక పాత్రలో ఒదిగిపోయి నటిస్తే అతన్ని మంచి నటుడు అని అంటారు…ఇక తనకున్న స్టార్ డమ్ ద్వారా సినిమాలు చేసి ప్రేక్షకుల్లో తన మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ భారీ క్రేజ్ ను సంపాదించుకున్న వ్యక్తి ని స్టార్ హీరో అంటారు. ఇక ఈయనకు నటనతో సంబంధం లేకపోయిబ వీళ్ళు భారీ ఓపెనింగ్స్ తో పాటు కథ, సినిమా బాగుంటే ఆటోమేటిగ్గా భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ఉంటారు…

    ఇక అలాగే మంచి పర్ఫార్మర్ ఎవరు అంటే ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్స్ ను ఎంచుకొని వాటిలో జీవిస్తూ నటించే నటులను పర్ఫామర్స్ అంటారు. ఇక వీళ్లకు స్టార్ డమ్ తో పనిలేదు. ఏ పాత్రలోనైనా సరే అలావొకగా నటిస్తూ మెప్పిస్తుంటారు. ముఖ్యంగా బిచ్చగాడి పాత్ర నుంచి శ్రీమంతుడు పాత్ర వరకు ప్రతి ఒక్క పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంటారు. ప్రేక్షకులు కూడా వీళ్ళ నుంచి పర్ఫామెన్స్ ను మాత్రమే ఎక్స్ పెక్ట్ చేస్తారు తప్ప స్టార్ డమ్ ను అసలు పట్టించుకోరు… కాబట్టి వీళ్ళను బెస్ట్ పెర్ఫార్మర్స్ అంటుంటారు..

    ప్రస్తుతం ఇండియాలో ఉన్న నటులలో బెస్ట్ నటుడు ఎవరు అనే విషయం లో ఒక్కరి పేరు మాత్రం చెప్పడం కష్టం.. కానీ ఆ కోవ కి వచ్చే వాళ్ల పేర్లను ఒకసారి మనం తెలుసుకుందాం…రామ్ చరణ్, అల్లు అర్జున్, ముమ్ముట్టి, మోహన్ లాల్, రణ్వీర్ సింగ్ లాంటి వాళ్లను మనం మంచి మంచి నటులుగా చెప్పుకోవచ్చు…

    ఇక స్టార్ హీరో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, ప్రభాస్,షారుక్ ఖాన్, సూర్య లాంటివారు ఈ కోవకి చెందుతారు.

    ఇక అలాగే బెస్ట్ పర్ఫార్మర్స్ విషయానికి వస్తే కమల్ హాసన్, విక్రమ్, ఎన్టీయార్, మహేష్ బాబు,అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి వారు ఈ కోవ కి చెందుతారు…

    నిజానికి మంచి నటులు స్టార్ హీరోగా క్రేజ్ ను కూడా సంపాదించుకోవచ్చు. అలాగే స్టార్ హీరోలు కూడా మంచి పర్ఫార్మర్లుగా గుర్తింపు పొందవచ్చు. ఇది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక ఇప్పటివరకు అందులో ఉన్న మూడు కేటగిరిస్ ను సొంతం చేసుకున్న నటుల్లో చిరంజీవి, రజినీకాంత్, అమితాబచ్చన్ లాంటి ముగ్గురు హీరోలు మాత్రమే ఉండటం విశేషం…