Allu Arjun : ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగారు. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారో అప్పటినుంచి పాన్ ఇండియాలో కూడా మన హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. ఇక బాలీవుడ్ హీరోలను సైతం పక్కకు నెట్టేసేలా మన హీరోలు చేస్తున్న సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరిస్తుండటం విశేషం…
పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో థియేటర్ యజమానితో పాటు అల్లు అర్జున్ మీద కూడా కేసునైతే నమోదు చేశారు. మరి అల్లు అర్జున్ సెక్యూరిటీ లేకుండా బయటికి వస్తున్నని ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్ కి ఇవ్వలేదని తెలియజేస్తున్నారు. మరి ఇందులో గవర్నమెంట్ తప్పేమీ లేదంటూ మొత్తం అల్లు అర్జున్ మీదే ఎందుకు నెట్టేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం గవర్నమెంట్ కు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు. ఇక ఈ సంఘటన జరిగిన వెంటనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఇదంతా అల్లు అర్జున్ వల్లే జరిగింది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేతులు దులిపేసుకోవడానికి ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ప్రతిపక్ష నేతలు సైతం తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదని హీరోలకు అభిమానులకు మధ్య భారీ బందోబస్తుని ఏర్పాటు చేశామని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూశామని కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇలాంటి వాటిలో ఫెయిలవుతుంది.
అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆ సంఘటనకు కారణం కానీ అల్లు అర్జున్ మాత్రమే టార్గెట్ చేసి అతన్ని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతానికైతే బెయిల్ మీద బయట ఉన్నప్పటికి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఇందులో నిజంగా ప్రభుత్వం తప్పేమి లేదా ఒక హీరోకి అభిమానులకు మధ్య సెక్యూరిటీని ఆరంజ్ చేయలేకపోవడం ప్రభుత్వం వైఫల్యమా లేదంటే అల్లు అర్జున్ గాని థియేటర్ యాజమాన్యంగా నిజంగానే ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో అల్లు అర్జున్ మాత్రమే ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక తన అభిమానులు తనను చూసి ఆనంద పడతారని ఉద్దేశ్యంతోనే ఆయన థియేటర్ దగ్గరికి వెళ్ళాడు కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు…