Niranjan Reddy : సమాజం లో ఎక్కడ ఏం జరిగిన పర్లేదు కానీ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే మాత్రం అందరి దృష్టి సినిమా వాళ్లపైనే ఉంటుంది. ముఖ్యంగా హీరోలను టార్గెట్ చేస్తూ చాలామంది విపరీతమైన కామెంట్లైతే చేస్తూ ఉంటారు. కారణం ఏదైనా కూడా సినిమా అనేది ప్రస్తుతం జనాల్లో మమేకం అయిపోయింది. కాబట్టి ఒక మంచి అయినా సరే చెడైనా సరే రెండు కూడా సినిమా ద్వారానే జనాల మీదకి ప్రొజెక్ట్ అవుతున్నాయి అంటూ చాలామంది చెబుతారు. తద్వారా మంచి జరిగితే సినిమా వాళ్ళని అభినందిస్తూ ఉంటారు. కొన్ని చెడు సంఘటనలు జరిగినప్పుడు విమర్శిస్తూ ఉంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. అంటే నెపోటిజం అనేది ఇండస్ట్రీలో ఎప్పటీ నుంచో ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కానీ నెపోటిజం వల్లే సినిమా హీరోలు అవుతారని చెప్పడం మాత్రం మూర్ఖత్వమనే చెప్పాలి. ఇక్కడ ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు మాత్రమే సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తారు. లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవల్సిందే ఈ విషయాన్ని చాలా మంది హీరోల విషయంలో మనం చూశాం…ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్స్ భారీగా నష్టపోయారు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు విషయంలో హైకోర్టుకు వెళ్లి అతనికి బేయిల్ తీసుకొచ్చిన లాయర్ నిరంజన్ రెడ్డి ఒక సినిమా ప్రొడ్యూసర్ వ్యవహరించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు.
ఇక నిరంజన్ రెడ్డి చాలా తెలివైనవాడు కోర్టులో నిన్న ఆయన జడ్జ్ ముందు వాదించిన వాదనను చూస్తే ప్రతి ఒక్కరికి అతని నాలెడ్జ్ ఏంటో తెలుస్తుంది. అంత తెలివైనవాడు ఇలాంటి ఆచార్య సినిమాని ఎందుకు ప్రొడ్యూస్ చేశాడు అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయనకి సంబంధించిన న్యూస్ ని వైరల్ చేస్తున్నారు.
నిజానికి కొరటాల శివ కథను బాగా రాసుకున్నప్పటికి ఆ కథను తీసే విషయంలోనే చాలా మార్పులు చేశారు. అందువల్లే ఆ సినిమా అలా అయిపోయింది అంటూ సగటు ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. మరి నిజానికైతే నిరంజన్ రెడ్డి లాంటి ఒక టాలెంటెడ్ పర్సన్ వల్లే అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
అందుకే అల్లుఅర్జున్ అభిమానులతో పాటు చాలా మంది సినిమా ప్రేక్షకులు కూడా నిరంజన్ రెడ్డి ని అభినందిస్తున్నారు…మరి ఇక మీదట కూడా ఆయన సినిమాలు చేసినట్లయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ సినిమాలు చేసుకుంటే మంచిదని చాలామంది ట్రేడ్ పండితులు సైతం అతనికి సలహాలను ఇస్తున్నారు…చూడాలి మరి ఇకమీదట తీసే సినిమాలతో సూపర్ సక్సెస్ సాధిస్తారా లేదా అనేది…