Vishwambhara Bimbisara: చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ ని కూడా దర్శకుడు ఇవ్వకుండా దాచి పెడుతూ వస్తున్నాడు. ఇక ఎట్టకేలకు దసరా కానుకగా ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక వశిష్ట ఇంతకుముందు చేసిన బింబిసార సినిమా కూడా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కడంతో ఈ సినిమాని కూడా అలాంటి ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా చూపించాలనే ప్రయత్నంలోనే ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ముఖ్యంగా రెండు యుగాలకు మధ్య ఇంటర్ లింకింగ్ పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా మనకు ఈ సినిమా టీజర్ ని చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక యుగానికి మరొక యుగానికి మధ్య ట్రావెలింగ్ అనేది ఎలా ఉండబోతుంది అసలు అన్యాయంతో విర్రవీగుతున్న రాక్షసులను హీరో ఎలా సంహరించాడు అనే ప్లాట్ పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బింబిసారా, విశ్వం భర రెండూ కూడా ఒకే ప్లాట్ పాయింట్ తో నడుస్తున్నట్టుగా కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక టైం ట్రావెలింగ్ ప్రాసెస్ లోనే ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా కూడా అలాంటి కథ తోనే ముందుకు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే బింబిసార సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.
మరి విశ్వంభర సినిమా కూడా అలాంటి మ్యాజిక్ చేయబోతుందా అనే క్యూరియాసిటిని ప్రేక్షకుల్లో రేకెత్తించడానికి ఈ టీజర్ చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఇక ఈ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి చిరంజీవి మరొకసారి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హై వోల్టేజ్ గ్రాఫిక్స్ ఉండడం కూడా ఈ సినిమాకు చాలావరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.ఇక గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి.
ఇక మొత్తానికైతే విశ్వంభర బింబీసార రెండు సినిమాలు కూడా రెండు యుగాలకు సంబంధించిన సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. ఇక విశ్వంభర సినిమా కూడా చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండి పోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనే దాన్నిబట్టే చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ భారీగా పెరుగుతుందా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు…