VISHWAMBHARA Teaser Highlights : ‘అవతార్’ ని తలపించిన ‘విశ్వంభర’..టీజర్ లో మీరెవ్వరూ గమనించని ఆసక్తికరమైన విషయాలు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం 'విశ్వంభర' కి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో అభిమానుల సమక్ష్యంలో ఈ టీజర్ ని విడుదల చేసారు. టీజర్ కాన్సెప్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, గ్రాఫిక్స్ పై మాత్రం దారుణమైన ట్రోలింగ్స్ సోషల్ మీడియా లో ఎదురు అవుతున్నాయి.

Written By: Vicky, Updated On : October 12, 2024 11:58 am
Follow us on

Viswambhara Teaser:  మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’ కి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో అభిమానుల సమక్ష్యంలో ఈ టీజర్ ని విడుదల చేసారు. టీజర్ కాన్సెప్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, గ్రాఫిక్స్ పై మాత్రం దారుణమైన ట్రోలింగ్స్ సోషల్ మీడియా లో ఎదురు అవుతున్నాయి. ఆరంభం అదిరిపోయినప్పటికీ, మధ్యలో వచ్చే VFX షాట్స్ చాలా ఆర్టిఫీషియల్ గా అనిపించింది. మూవీ కాన్సెప్ట్ చూస్తే అవతార్ తరహా లో ఒక కొత్త ప్రపంచం లో ఈ సినిమా కథ జరగబోతుంది అనేది అర్థం అవుతుంది. స్వర్గం నుండి మెగాస్టార్ చిరంజీవి తెల్లని రెక్కల గుర్రం పై ఎగురుకుంటూ వచ్చే షాట్ చాలా బాగుంది.

విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరించినంత మాత్రానా వెలుగు రాదని కాదు అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలు అవుతుంది. ఆ తర్వాత వింత జంతువులు, వింత మనుషులు ఉండడాన్ని ఈ టీజర్ లో మనం గమనించొచ్చు. అసలు ఈ కథ భూమి మీదనే జరిగే కథయేనా?, లేదా వేరే గ్రహం లో జరిగే కథ నా?, లేదా భూమి మీదనే ఎవరికీ తెలియని రహస్య ప్రాంతంలో ఈ కథ జరుగుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా నిల్చింది. మూవీ కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది కానీ, గ్రాఫిక్స్ మీద శ్రద్ద చూపించి ఉండుంటే మరో లెవెల్ లో ఉండేది. వాస్తవానికి సినిమాలో గ్రాఫిక్స్ బాగానే ఉంటుంది, టీజర్ ఆగష్టు లో కట్ చేసి, అప్పటికప్పుడు గ్రాఫిక్స్ ని జత చేసి విడుదల చేయడం వల్ల అందరికీ చీప్ క్వాలిటీ లాగ అనిపించిందని. సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు. గతం లో ‘ఆదిపురుష్’ చిత్రం టీజర్ విడుదల సమయంలో కూడా గ్రాఫిక్స్ పై ఇలాంటి ట్రోల్స్ దారుణంగా వచ్చాయి.

ఈ నెగటివ్ ఫీడ్ బ్యాక్ చూసిన తర్వాత మూవీ టీం ఆ చిత్రాన్ని వాయిదా వేసి, గ్రాఫిక్స్ పై మరింత వర్క్ చేసి విడుదల చేసారు. సినిమా కంటెంట్ పరంగా నెగటివ్ రివ్యూస్ వచ్చాయి కానీ, విడుదల తర్వాత గ్రాఫిక్స్ మీద మాత్రం ఎలాంటి నెగటివ్ రిపోర్ట్స్ రాలేదు. విశ్వంభర కాన్సెప్ట్ అదిరిపోయిందని, గ్రాఫిక్స్ వర్క్ అంచనాలకు తగ్గట్టుగా చేస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుందని, 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని అవలీలగా అందుకుంటుందని అంటున్నారు. గ్రాఫిక్స్ విషయం లో రాజమౌళి తర్వాత నూటికి నూరు శాతం మార్కులు సంపాదించింది నాగ అశ్విన్ మాత్రమే. కల్కి తరహా లో కొత్త ప్రపంచాన్ని అయితే విశ్వంభర లో సృష్టించారు కానీ, గ్రాఫిక్స్ కూడా అదే స్థాయిలో ఉంటే మాత్రం టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా ఈ చిత్రానికి సంచలన విజయం సాధించేంత స్టామినా ఉంటుంది. మరి మేకర్స్ ఏమి చేస్తారో చూడాలి.

#VishwambharaTeaser,#TheVishwambhara #Chiranjeevi, #MegastarChiranjeevi, #UVCreations,#Vishwambhara, #VishwambharaMovie, #KonidelaChiranjeevi, #VishwambharaTrailer,#LatestTeluguMovie,#LatestTeluguTrailers ,
#TrishaKrishnan #Vassishta, #MMKeeravani,

Tags