Mahesh: కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా హీరోకు మంచి ఆఫర్లు వస్తే హీరోయిన్ కు రావు.. హీరోయిన్ కు వస్తే హీరోకు రావు. హిట్ పడినా ఆశించిన ఫలితాలు రాని స్టార్లు కూడా ఉంటారు. అదే విధంగా షాపింగ్ మాల్ సినిమా హీరో పరిస్థితి అని చెప్పాలి. ఈ సినిమాను మీలో ఎంత మంది చూశారు? అయితే ఈ సినిమా తమిళంలో అంగాడి తెరు అనే పేరుతో విడుదలైతే.. తెలుగులో డబ్బింగ్ చేసి షాపింగ్ మాల్ అని పేరు పెట్టారు. తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది సినిమా.
షాపింగ్ మాల్ సినిమాలో నటించిన అంజలి ఈ రోజు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంటే.. హీరో మహేష్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఇంతకీ ఈ హీరో ఏమయ్యాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఈయన తమిళనాడులోని దిండుగల్ అనే ప్రాంతంలో పుట్టారు. అతడు జాతీయ స్థాయిలో వాలీబాల్ క్రీడాకారుడిగా ఉన్న సమయంలోనే షాపింగ్ మాల్ సినిమా ఆఫర్ వచ్చింది. ఒక రోజు వాలీబాల్ టోర్నమెంట్ ఆడి రోడ్డు దాటుతున్న అతడిని ఆపి దర్శకుడు వసంత్ బాలన్ అసిస్టెంట్స్ చూడ్డానికి బాగున్నావు మా సినిమాలో హీరోగా చేస్తావా అని అడిగారట.
కానీ జాతీయ స్థాయిలో టోర్నమెంట్ ఆడుతున్నాడు కాబట్టి అప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వెళ్లిపోయాడట.ఆ తర్వాత వసంత్ బాలన్ అసిస్టెంట్స్ తరచూ ఫోన్లు చేసి అడిగారట. అప్పటికి కేవలం ఇంటర్ మాత్రమే పూర్తి చేసిన ఈయనకు 18 ఏళ్లు. సినిమా రంగం గురించి కూడా ఏది తెలియదట. అదే సమయంలో టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు కాలికి గాయం అయితే ఈ గాయంతో ఎక్కువ రోజులు టోర్నమెంట్ ఆడలేవు అని చెప్పారట కోచ్. కానీ సినిమా అవకాశాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రావు ప్రయత్నించు అన్నారట.
సినిమా లైఫ్ బాగుంటే చేయు.. లేదా మళ్లీ ఆడు అని చెప్పారట. అలా షాపింగ్ మాల్ సినిమా కోసం వెళ్లారట. దాదాపు 180 రోజుల పాటు సినిమా షూటింగ్ చేశారు. ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ ను సంపాదించుకుందో తెలిసిందే. కానీ ఈ సినిమా తర్వాత 14 సినిమాల్లో నటించినా కూడా మహేష్ కు మళ్లీ విజయం దక్కలేదు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లి మందుకు బానిస అయ్యారట. పెళ్లి చేసుకోకుండా సినిమాలే ప్రపంచంగా బతుకుతున్నారు. ఇప్పటికి అయినా మంచి అవకాశం వస్తే బాగుండు.
అయితే ఈయనకు సినిమాలో అవకాశం రాకపోయి ఉంటే స్పోర్ట్ కోటాలో ఆర్మీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి ఉద్యోగం సంపాదించి ఉండేవాడు. తనతో వాలీబాల్ ఆడిన వారందరూ కూడా సెటిల్ అయిపోయారట. తను మాత్రం సినిమాల మీద ఫోకస్ తో ఎటు కాకుండా మిగిలిపోయారట.