Cars logo: కారు.. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్‌కు కూడా నిత్యావసరంగా మారింది. ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా భారతీయ మోటార్ కంపెనీలతోపాటు విదేశీ కంపెనీలు కూడా కర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రతీ మోటార్ కంపెనీ అది తయారు చేసే కారుపై ఒక లోగో ముద్రిస్తుంది. అయితే కొన్ని లోగోల వెనుక ఆసక్తికర కథనాలు కూడా ఉన్నాయి. కొన్ని లోగోలు, వాటి వెనుక ఉన్న కహానీ తెలుసుకుందాం..
హుందాయ్..
హుందాయ్ కంపెనీ తను తయారు చేసే ప్రతీ కారుపై హెర్ లాంటి లోగో ముద్రిస్తుంది. కానీ ఇది హెచ్ కాదు. అందులో ఇద్దరు షేక్‌హాడ్ చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకరు కస్టమర్, ఒకరు కంపెనీ రిప్రజెంటేటివ్.
మెర్సిడీస్ కార్లు..
మెర్సిడీస్ బెంజ్ కారుపై మూడు యారోలతో లోగో ఉంటుంది. అందులో మూడు యారోలు మూడింటిని రిప్రజెంట్ చేస్తాయి. పైకి చూపించే యారో గాలిని, కుడివైపు యారో నీటిని, ఎడమవైపు యారో భూమిని సూచిస్తుంది.
టయోటా..
ఇక టయోటా కార్లపై మూడు రింగులు ఉంటాయి. ఇందులో ఒక్కో రింగు ఒక్కో షేప్‌లో ఉంటుంది. ఔటర్ రింగ్ ఎర్త్‌ని, ఇన్నర్‌గా ఉన్న రెండు రింగులు కస్టమర్, కంపెనీ హార్ట్ క్లోస్‌గా ఉన్నట్లు సూచిస్తుంది. ఈ లోగోను టయోటాలో ఉన్న ప్రతీ లెటర్‌లో రిప్రజెంట్ అయ్యేలా డిజైన్ చేశారు.
ఆడీ కార్లపై..
ఆడీ సంస్థ కూడా కార్లపై నాలుగు రింగులు ఉంటాయి. ఇవి నాలుగు కంపెనీల మెర్జ్‌ను సూచిస్తాయి. అందుకే నాలుగు రింగులు కలిసినట్లుగా ఉంటాయి.