అవసరాల-నాని కాంబో సెట్టయినట్టేనా?

పక్కింటి కుర్రాడి కన్పించే నాని టాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే నాని 25వ సినిమా ‘వి’ ఓటీటీలో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ తొలిరోజు నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ‘జెర్సీ’తో ఇండస్ట్రీ హిట్టందుకున్న నానికి ‘వి’ పరాజయం మైనస్ గా మారింది. Video: పవన్ సినిమా వెనుక గురూజీ ఈక్రమంలోనే నాని వరుస మూవీలకు కమిట్ అవుతూ ‘వి’ ప్రభావం తనపై లేదని చాటుతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలకు […]

Written By: NARESH, Updated On : October 27, 2020 12:24 pm
Follow us on

పక్కింటి కుర్రాడి కన్పించే నాని టాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే నాని 25వ సినిమా ‘వి’ ఓటీటీలో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ తొలిరోజు నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ‘జెర్సీ’తో ఇండస్ట్రీ హిట్టందుకున్న నానికి ‘వి’ పరాజయం మైనస్ గా మారింది.

Video: పవన్ సినిమా వెనుక గురూజీ

ఈక్రమంలోనే నాని వరుస మూవీలకు కమిట్ అవుతూ ‘వి’ ప్రభావం తనపై లేదని చాటుతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని తాజాగా అవసరాల శ్రీనివాస్ తో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతుందనే టాక్ ఇండస్ట్రీలో విన్పిస్తోంది.

దర్శకుడు అవసరాల శ్రీనివాస్.. హీరో నాని ఇద్దరు కూడా మంచి మిత్రులు. వీరద్దరు ‘అష్టాచమ్మా’ సినిమాతో ఒకేసారి హీరోలుగా ఎంట్రీలు ఇచ్చారు. నాని హీరోగా గుర్తింపు తెచ్చుకోగా అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా.. నటుడిగా రాణిస్తున్నాడు. అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’.. ‘జ్యో అచ్చుతానంద’ మూవీలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Video: బిగ్ బాస్ లో దొంగ ఓటింగ్

అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం నాగశౌర్యతో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ చేస్తుండగానే అవసరాల నానికి ఓ కథను విన్పించాడట. ఇది నానికి బాగా నచ్చడంతో త్వరలోనే ఓ మూవీ చేద్దామని చెప్పాడట. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుండగా ఈ సినిమాలు పూర్తయ్యే లోపు అవసరాల సైతం నాగశౌర్య మూవీని పూర్తి చేయనున్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా సెట్ అయినట్లేననే టాక్ విన్పిస్తోంది.