Ram Charan- Upasana: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన శుభవార్త రానే వచ్చింది. రామ్ చరణ్ మరియు ఉపాసన కాసేపటి క్రితమే పండింటి ఆడబిడ్డకు జన్మని ఇచ్చారు. అపోలో హాస్పిటల్స్ ఈమేరకు ఒక బులిటెన్ ని విడుదల చేసింది. ఉపాసన కాసేపటి క్రితమే ఆడ బిడ్డకి జన్మని ఇచ్చిందని, తల్లి కూతురు ఇద్దరు క్షేమంగానే ఉన్నారని తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న వెంటనే చిరంజీవి మరియు సురేఖ గారు హాస్పిటల్ కి చేరుకున్నారు. వాళ్ళ ఆనందానికి హద్దులే లేవు.
ఉదయం తెల్లవారు జామునే అభిమానులు వందలాది గా అపోలో హాస్పిటల్స్ కి గుమ్మిగూడారు. అత్యధిక అభిమానులు వస్తారని భావించే ముందుగానే అపోలో హాస్పిటల్స్ టీం పాసులను ఏర్పాటు చేసారు. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో చిరంజీవి కుటుంబం గురించి జరుగుతున్న ఒక ప్రచారం ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవికి రామ్ చరణ్ తో పాటుగా ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అందరికీ కూడా ఆడపిల్లలే జన్మించారు. మొదటి కూతురు సుస్మిత విష్ణు ప్రసాద్ అనే అతనిని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరికీ సమర మరియు సంహిత అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. మరో పక్క రెండవ కూతురు శ్రీజా కి రెండు సార్లు వివాహమైన విషయం అందరికీ తెలిసిందే, మొదటి భర్త తో నివ్రితి అనే అమ్మాయి జన్మించగా, రెండవ భర్త కళ్యాణ్ దేవ్ తో నీవీక్ష అనే అమ్మాయికి జన్మని ఇచ్చింది. ఇప్పుడు ఉపాసన మరియు రామ్ చరణ్ కి కూడా ఆడపిల్లనే పుట్టడం తో కొణిదెల మూడవ తరం మొత్తం ఆడవాళ్లతోనే నిండిపోయింది.
అయితే రామ్ చరణ్ మరియు ఉపాసనకు ఆడపిల్లే పుడుతుందని జోతిష్యుడు ముందే చెప్పారట, మగబిడ్డ జన్మించాలంటే ఒక యాగం చెయ్యాల్సి ఉంటుందని రామ్ చరణ్ మరియు ఉపాసనలకు చెప్పగా, మాకు మగబిడ్డనే కావాలని రూల్ ఏమి లేదని, ఆడబిడ్డ అంటే మాకు ఎంతో ఇష్టమని, ఈ యాగాలు వంటివి ఏమి అవసరం లేదని చెప్పాడట రామ్ చరణ్, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారబోతుంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Is the reason why all the 3rd generation of chiranjeevis family are born girls is because of not doing that yagm
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com