https://oktelugu.com/

RRR Rajamouli strategy: రాజమౌళి స్ట్రాటజీపై అసహనం వ్యక్తం చేస్తున్న మీడియా?

RRR Rajamouli strategy: అగ్రదర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ముందే సినిమాపై భారీగా హైప్ పెంచిన రాజమౌళి కొన్ని విషయాల్లో పూర్తిగా మనీ మైండ్ గా మారారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రమోషన్ పేరుతో ఈవెంట్ చేస్తున్నామని చెప్పిన రాజమౌళి వాటి హక్కులను ఓటీటీ అమ్మేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం దర్శకుడు రాజమౌళి దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా […]

Written By: , Updated On : December 23, 2021 / 03:07 PM IST
Rajamouli

Rajamouli

Follow us on

RRR Rajamouli strategy: అగ్రదర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ముందే సినిమాపై భారీగా హైప్ పెంచిన రాజమౌళి కొన్ని విషయాల్లో పూర్తిగా మనీ మైండ్ గా మారారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రమోషన్ పేరుతో ఈవెంట్ చేస్తున్నామని చెప్పిన రాజమౌళి వాటి హక్కులను ఓటీటీ అమ్మేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

RRR Rajamouli strategy

RRR Rajamouli

‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం దర్శకుడు రాజమౌళి దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ వేరే సినిమాలేవీ చేయకుండా ‘ఆర్ఆర్ఆర్’ కోసమే కష్టపడ్డారు. డీవీవీ దానయ్య ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు చేశారు. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ పై తొలి నుంచి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ మూవీ జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజు అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ భారీగా ప్రమోషన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ అదిరిపోయేలా చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం పీవీఆర్ తో భారీ డీల్ చేసుకొని వార్తల్లో నిలిచింది. అలాగే పలు నగరాల్లో ప్రెస్ మీట్లు, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు, ప్రోకబడ్డీతో టై అప్ చేసుకొని ‘ఆర్ఆర్ఆర్’ను రాజమౌళి భారీగా ప్రమోట్ చేస్తున్నారు.

Also Read: కొమురం భీమూడో సాంగ్​ ప్రోమో రిలీజ్​.. ఎన్టీఆర్ పై రాజమౌళి ప్రేమ ఎంతో తెలిసింది

‘బాహుబలి’ని మించే స్థాయిలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో రాజమౌళి మార్క్ స్పష్టం కన్పిస్తుంది. అయితే ఇటీవల ముంబాయిలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ ఈవెంట్ ను మీడియాకు లైవ్ ఇవ్వకుండా ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్ కు అమ్మేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు ప్రేక్షకులు, ఇటూ మీడియా అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ప్రమోషన్ ఈవెంట్ అంటే జనాలకు మీడియా ద్వారా చేరువడం.

కానీ రాజమౌళి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ ను మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ విడుదల చేయకుండా ఓటీటీకి అమ్మి సోమ్ము చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి తీరుపై మీడియా అసహనాన్ని వ్యక్తం చేస్తోందని సమాచారం. తమతో కావాల్సినంత కవరేజీ చేసుకొని చివరికీ ఈవెంట్ ను ఓటీటీకే అమ్మేసుకోవడంపై మండిపడుతున్నారు. ఏదిఏమైనా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కు కావాల్సినంత ప్రమోషన్స్ తో ‘ఆర్ఆర్ఆర్’ ను నిత్యం వార్తల్లో ఉంచుతుండటం విశేషం.

Also Read: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్: రాజమౌళి దేన్నీ వదలడం లేదే..!