Srihari: శ్రీహరి 1987లో విడుదలైన బ్రహ్మనాయుడు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. విలన్ గా సక్సెస్ అయ్యాడు. వందల చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాడు. అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి అనేక సూపర్ హిట్స్ కొట్టాడు. సాంబయ్య, దేవా, గణపతి, భద్రాచలం మంచి విజయాలు సాధించాయి. వరుస పరాజయాల నేపథ్యంలో శ్రీహరి హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాడు. ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. ఢీ, కింగ్, మగధీర చిత్రాల్లో శ్రీహరి రోల్స్ బాగుంటాయి.
నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న శ్రీహరి… అకాల మరణం పొందారు. ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్ కొరకు శ్రీహరి ముంబై వెళ్లారు. షూటింగ్ సెట్స్ లోనే శ్రీహరి అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ… 2013 అక్టోబర్ 9న శ్రీహరి కన్నుమూశారు. అప్పటికి శ్రీహరి వయసు 49 ఏళ్ళు మాత్రమే. కాగా శ్రీహరి మరణానికి పరోక్షంగా డైరెక్టర్ ప్రభుదేవా కారణం అయ్యాడు.
షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా జంటగా దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రం ఆర్.. రాజ్ కుమార్. ఈ మూవీలో శ్రీహరి ఓ కీలక రోల్ చేశారు. నాలుగు రోజులుగా ఫీవర్ తో బాధపడుతున్న శ్రీహరి దర్శకుడు ప్రభుదేవా మీద ఇష్టంతో అలానే షూటింగ్ లో పాల్గొన్నాడట. దానికి తోడు అవుట్ డోర్ షూటింగ్ కావడంతో దోమలు కుట్టి శ్రీహరి మరింత అనారోగ్యానికి గురయ్యాడట. దాని వలన విషమ స్థితికి శ్రీహరి ఆరోగ్యం చేరింది. చికిత్స అందించినా కూడా ఆయన ప్రాణాలు దక్కలేదు.
శ్రీహరి భార్య డిస్కో శాంతి ఒకప్పటి నటి అన్న సంగతి తెలిసిందే. ఆమె అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మేఘాన్ష్ హీరోగా మూవీ చేశారు. రాజ్ దూత్ టైటిల్ తో 2019లో ఒక చిత్రం చేశాడు. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరలా మేఘాన్ష్ మూవీ చేయలేదు. ఇక శ్రీహరి మరణం ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కరుడుగట్టిన విలన్ రోల్స్ చేసిన కడుపుబ్బా నవ్వించే కమెడియన్ గా సినిమాలు చేశాడు.