Anchor Pradeep Marriage: ప్రముఖ వ్యాఖ్యాతల్లో ప్రదీప్ ఒకరు. తన మాటలతో అందరిని మంత్రముగ్దులను చేస్తాడు. చురుకైన మాటలతో అందరిని నవ్విస్తుంటాడు. ఇప్పుడున్న వ్యాఖ్యాతల్లో అందరికంటే సీనియరే అయినా ఇంకా పెళ్లికాదనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఇటీవల ఓ బాంబు పేల్చాడు. తనకు ఇదివరకే పెళ్లయిందని అందరిలో ఆశ్చర్యం నింపాడు. వివాహం అయితే భార్య ఏదనే ప్రశ్నలుకూడా వచ్చాయి. కానీ ప్రదీప్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు అనే దానిపై ఇంకా అందరికి సందిగ్దత వ్యక్తమవుతోంది. అసలు ప్రదీప్ విషయంలో ఏం జరుగుతోందనే ఆసక్తి అందరిలో వస్తోంది. పెళ్లంటేనే ఎందుకు భయపడుతున్నాడు. అబద్ధాలు ఎందుకు చెబుతున్నాడు? అని ఆరా తీస్తున్తున్నారు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వచ్చాయి. ప్రముఖ రాజకీయ నాయకుడి కూతురును ప్రదీప్ వివాహం చేసుకుంటాడనే ఊహాగానాలు వినిపించాయి. అతడికి పెళ్లి అవుతుందో లేదో కానీ అందరు పెళ్లిపై ఎదురు చూస్తున్నారు. మోస్ట్ ఏజ్ డ్ బ్యాచులర్ గా ప్రదీప్ ను పేర్కొంటున్నారు. దీంతో బ్యాచులర్ జీవితానికి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎప్పుడనే దానిపై స్పష్టత లేకుడా పోతోంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. తనకు ఇదివరకే పెళ్లి అయిందని చెప్పడంతో అందరు కంగుతిన్నారు.
ఓ యూట్యూబ్ కోసం తనను తానే ఇంటర్వ్యూ చేసుకున్నాడు. తనకు ఇదివరకే పెళ్లయిందని అందరిలో ఆసక్తి రేపాడు. దీంతో ఎప్పుడ జరిగిందని అందరు అడగ్గా యూ ట్యూబ్ ల చూడలేదా? నాలుగైదు సార్లు అయిందంటూ చమత్కరించాడు. దీంతో అందరు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన ప్రొమో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రదీప్ ఇలా ఎంత కాలం నెట్టుకొస్తాడో తెలియడం లేదు. పెళ్లి చేసుకుని హాయిగా ఉండవయ్య బాబూ అంటూ బ్యాచులర్ లైఫ్ తోనే కాలం గడిపేస్తున్నాడు.

తెలుగు యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు టాపులో ఉంటాడు. తనదైన ప్రత్యేక శైలితో అందరిని నవ్విస్తుంటాడు. అటు బుల్లితెరతో పాటు వెండితెరలో కూడా తనకు ఓ స్థానం తెచ్చుకున్నాడు. ముప్పయి రోజుల్ల ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా చేశాడు. ఇంకా కొన్ని చిత్రాల్లో పలు క్యారెక్టర్లలో నటించి తనలో ఓ మంచి నటుడు ఉన్నాడనే విషయం కూడా చాటిచెప్పాడు. ఇంతటి ఖ్యాతి తెచ్చుకున్న ప్రదీప్ కు మాత్రం ఇంకా పెళ్లి కాకపోవడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు పెళ్లిని వాయిదా వేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు.