Adipurush Trailer Audience Response: ఆదిపురుష్ టీజర్ కంటే ట్రైలర్ బెటర్ గా ఉందా? ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటీ?

ఆదిపురుష్ మూవీ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. టీజర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ పరిగణలోకి తీసుకుని మూవీని వాయిదా వేశారు.

Written By: Shiva, Updated On : May 9, 2023 3:12 pm

Adipurush Trailer Audience Response

Follow us on

Adipurush Trailer Audience Response: ప్రతి సినిమా విషయంలో ప్రోమోలు కీలక పాత్ర పోషిస్తాయి. టీజర్, ట్రైలర్ ఆధారంగా సినిమాను చూడాలా? వద్దా? అని ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. ఇది నిజం. ప్రభాస్ భారీ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆదిపురుష్ టీజర్ పెద్ద ఎత్తున విమర్శలపాలైంది. ఆదిపురుష్ మూవీ మీద టీజర్ విపరీతమైన నెగిటివిటీ తెచ్చింది. ప్రధాన పాత్రల గెటప్స్, విజువల్స్ అంతగా మెప్పించలేదన్న వాదన తెరపైకి వచ్చింది ఆదిపురుష్ టీజర్ చూసి నిరుత్సాహపడి ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ కి వార్నింగ్ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ చేశారు.

ఆదిపురుష్ మూవీ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. టీజర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ పరిగణలోకి తీసుకుని మూవీని వాయిదా వేశారు. రావణాసురుడు, హనుమంతుడు గెటప్స్ ని హిందూ వర్గాలు తప్పుబట్టాయి. దర్శకుడు ఓం రౌత్ పై మాటల దాడికి దిగారు. అసలు ఓం రౌత్ కి రామాయణం తెలుసా? అవగాహన లేకుండా సినిమా ఎలా తీస్తారని మండిపడ్డారు. ఆదిపురుష్ చిత్ర ప్రదర్శన అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రైలర్ కట్ చేశారు. మూడు నిమిషాలకు పైగా నిడివి కలిగిన టీజర్ అద్భుతమనే చెప్పాలి. టీజర్ తో పోల్చుకుంటే చాలా బెటర్. విజువల్స్ ఆకట్టుకున్నాయి. ప్రధాన పాత్రల మధ్య ఉన్న మానసిక సంఘర్షణను ట్రైలర్ లో హైలెట్ చేశారు. ప్రభాస్ డైలాగ్స్ మాత్రం మరోసారి ఇబ్బంది పెట్టాయి. ఆయన డైలాగ్ డెలివరీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. పౌరాణిక చిత్రాల విషయంలో డైలాగ్స్ చాలా ముఖ్యం. ఇక కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ మెప్పించారు.

ఆదిపురుష్ మూవీ ట్రైలర్ అంచనాలు అందుకుందని చెప్పొచ్చు. ఆదిపురుష్ మూవీ జూన్ 16న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. ఇక బాహుబలి 2 అనంతరం ప్రభాస్ కి క్లీన్ హిట్ లేదు. సాహో, రాధే శ్యామ్ ఒకదాన్ని మించి మరొకటి నిరాశపరిచాయి. ఆదిపురుష్ మూవీతో ఆయన కమ్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి పౌరాణిక చిత్రం చేస్తున్నారు.