https://oktelugu.com/

Baby Movie: ‘బేబీ’లో హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నది ఆ డైరెక్టర్ తమ్ముడా? అతడి బ్యాక్ గ్రౌండ్ ఇదీ

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ‘బేబీ’ సినిమా రూపుదిద్దుకుంది. సాయి రాజేశ్వర్ ఈ సినిమాకు డైరెక్టర్. ముందుగా ఒకరిని, ఆ తరువాత మరొకరిని హీరోయిన్ ప్రేమిస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 15, 2023 / 12:47 PM IST

    Baby Movie

    Follow us on

    Baby Movie: గత ఏడాది కాలంలో చిన్న సినిమాలు సంచలన విజయం సాధిస్తున్నాయి. ఏమాత్రం ఎక్స్ పెక్ట్ చేయనివి బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నారు. అలాంటి వాటిలో ‘బేబీ’ఒకటిగా చెప్పుకోవచ్చు. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. కొన్ని రోజుల పాటు థియేటర్లు హౌస్ ఫుల్ తో నడిచాయి. ఆ తరువాత ఆహా ఓటీటీలో రిలీజై మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ తరుణంలో సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు పెట్టారు. ఈ సినిమాలో హీరోలను కాదని హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అలా పెళ్లి చేసుకున్న వ్యక్తి కాసేపు మాత్రమే కనిపిస్తాడు. కానీ ఆయన ఫేమస్ అయ్యాడు.అతనిపై విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే ఆయన సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ డైరెక్టర్ కు సోదరుడు. అంతేకాకుండా ఇంతకుముందు చాలా సినిమాల్లో నటించారు కూడా. మరి ఆయన గురించి వివరాల్లోకి వెళితే..

    ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ‘బేబీ’ సినిమా రూపుదిద్దుకుంది. సాయి రాజేశ్వర్ ఈ సినిమాకు డైరెక్టర్. ముందుగా ఒకరిని, ఆ తరువాత మరొకరిని హీరోయిన్ ప్రేమిస్తుంది. కానీ ఇద్దరిని కాదని చివరికి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. బేబీ పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు కృష్ణ మల్లిడి. బేబీ కన్నా ముందు కృష్ణ కలర్ ఫోటో లో కూడా నటించాడు. ఇందులో సుహాస్ కు సీనియర్ గా కనిపిస్తాడు. అయితే ఏ సినిమా ఆయనకు బ్రేక్ ఇవ్వలేదు. బేబీ మూవీలో కొన్ని సెకన్లపాటు కనిపించిన అతను ఫేమస్ అయ్యాడు. అయితే ఈయన ఓ స్టార్ డైరెక్టర్ కు తమ్ముడు. ఆయన ఎవరో కాదు మల్లిడి వశిష్ట.

    మల్లిడి వశిష్ట ‘బింబిసార’ మూవీకి డైరెక్టర్. ఈ మూవీ బ్లాక్ బస్టర్అయిన విషయం తెలిసిందే. వశిష్ట తండ్రి గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ఆయనకు ఉన్న సినీ నేపథ్యంతోనే కుమారులు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. వీరిలో ఒకరు డైరెక్టర్ అయ్యారు. వశిష్ట మల్లిడి తరువాత మూవీ మెగాస్టార్ తో చేయడానికి ప్లాన్ వేశారు. ఇక వల్లిడి కృష్ణ మాత్రం పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వస్తున్నాడు. కానీ ఆయన ‘బేబీ’ మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.

    అలాగే మల్లిడి కృష్ణపై ఇదివరకు విపరీతమైన ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ తమ్ముడు అని తెలిసేసరికి ఆయన గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన స్టార్ యాంకర్ విష్ణు ప్రియతోనూ కలిసి ఉన్న ఫొటోలు ఉన్నాయి. దీంతో వీరిద్దరు బంధువులు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది బంధుత్వం ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వీరిలో మల్లిడి కృష్ణ కూడా చేరారు.