https://oktelugu.com/

Jawan Collections: జవాన్ 8వ రోజు వసూళ్లు… ఇది కదా షారుఖ్ ఖాన్ అంటే!

ఎనిమిదో రోజు జవాన్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు 18 కోట్ల పైగా వసూళ్లు చేసింది. గతంలో పఠాన్ సినిమా కూడా సరిగ్గా ఎనిమిదో రోజు 18 కోట్ల దాకా నెట్ వసూళ్లు చేసింది.

Written By:
  • Shiva
  • , Updated On : September 15, 2023 / 12:55 PM IST

    Jawan

    Follow us on

    Jawan Collections: ఒక కమర్షియల్ సినిమా కు హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో, అసలు కమర్షియల్ సినిమా స్థాయి ఏమిటో నిరూపిస్తుంది జవాన్ సినిమా. షారుఖ్ ఖాన్ హీరోగా సౌత్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. షారుఖ్ గత సినిమా పఠాన్ ను తలదన్నే రీతిలో ఈ సినిమా వసూళ్లు చేస్తుంది. ఇప్పటికి విడుదలై ఎనిమిది రోజులు అవుతున్న కానీ కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో సాధిస్తుంది.

    ఎనిమిదో రోజు జవాన్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు 18 కోట్ల పైగా వసూళ్లు చేసింది. గతంలో పఠాన్ సినిమా కూడా సరిగ్గా ఎనిమిదో రోజు 18 కోట్ల దాకా నెట్ వసూళ్లు చేసింది. ఇక జవాన్ సినిమా ఓవరాల్ ఇండియా వైడ్ గా 390 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. ఇక గ్రాస్ విషయానికి ఈ సినిమా ఇప్పటికే 700 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ వారం ముగిసేసరికి జవాన్ ఈజీగా 900 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. పైగా ఈ వీకెండ్ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

    ఇప్పటికే వరల్డ్ వైడ్ గా జవాన్ సినిమా 80 మిలియన్స్ క్రాస్ చేసింది. ఈ శనివారం ముగిసేనాటికి 100 మిలియన్ క్లబ్ లోకి చేరడం ఖాయం. షారుఖ్ ఖాన్ గత సినిమా పఠాన్ ఫుల్ రన్ లో 130 మిలియన్స్ సాధించింది. దాన్ని జవాన్ బద్దలుకొట్టటం ఖాయం. ఇప్పటిలో ఈ సినిమా ఊచకోత ఆగేలా కనిపించడం లేదు. ఈ వారం కూడా బాలీవుడ్ లో సరైన సినిమా అంటూ మరొకటి లేదు. ఇది కూడా జవాన్ వసూళ్లు కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

    మరోపక్క జవాన్ సినిమా కు ఇండియన్ స్టార్ హీరోస్ అందరు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తాజాగా పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ జవాన్ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. దానికి షారుఖ్ ఖాన్ కూడా రిప్లై ఇస్తూ బన్నీ నటించిన పుష్ప గురించి ప్రశంసలు కురిపించారు.. బన్నీని ఫైర్ తో పోల్చుతూ షారుఖ్ వేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.